ప్రియా పాటపై స్మృతి ఇరానీకి ఫిర్యాదు!

Priya Prakash Varrierకనుసైగలతో, అద్భుతమైన హావభావాలతో రాత్రికి రాత్రే టాప్ సెటబ్రిటీగా మారిపోయింది మలయాళ నటి ప్రియా వారియర్. ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ దక్కని సెలబ్రిటీ స్టేటస్ ఆమెకు ఒక్క రోజులోనే దక్కింది. మరోవైపు, ఆమె కనిపించిన పాటపై ముస్లింలు మండిపడుతున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉండే ఓ పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఫిర్యాదు కూడా చేశారు.

ADVERTISEMENT

ప్రియా నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ అనే పాటను తొలగించాలని ముంబైకి చెందిన పలు ముస్లిం సంఘాలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి విన్నవించాయి. ప్రియా నటించిన పాటలోని భావం ముస్లింల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని రజా అకాడమీ తెలిపింది. ఈ పాట మహమ్మద్ ప్రవక్త భార్యను తప్పుగా చూపిస్తోందని రజా అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు సయీద్ నూరీ తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories