ట్రైలర్ టాక్ – తెలుగులో అరవ కామెడీ!

remo-telugu-trailer-videoఇటీవలే తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన “రెమో” సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు డబ్బింగ్ హక్కులు తీసుకున్న విషయం తెలిసిందే. టాప్ ప్రొడ్యూసర్ డబ్బింగ్ హక్కులు దక్కించుకావడంతో, తెలుగులో కూడా ఈ సినిమా ఆడియో వేడుక ఘనంగా జరిగింది. “రెమో” చిత్రయూనిట్ మొత్తం పాల్గొనగా, ‘కుందనపు బొమ్మ’ సమంత ముఖ్య అతిధిగా విచ్చేసింది. ఈ సందర్భంగా విడుదలైన ధియేటిరికల్ తమిళ కామెడీని తెలుగు ప్రేక్షకులకు రుచిచూపిస్తోంది.

ఈ సినిమా కధ ఏంటో పూర్తిగా ఈ ట్రైలర్ లో చెప్పేయడంతో ఎలాంటి ట్విస్ట్ లకు తావు లేకుండా ప్రేక్షకులు ఈ అరవ కామెడీని చూడడానికి సిద్ధమైపోవచ్చు. తమిళంలో ఘనవిజయం సాధించడంతో, తెలుగులో కూడా అదే స్థాయిలో విజయం వరిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ‘ఎంటర్టైన్మెంట్’ బేస్ గా సాగే ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కావడం ప్రధాన ప్లస్ పాయింట్. ‘నేను శైలజ’ ద్వారా తెలుగు నాట క్రేజ్ ఏర్పరచుకున్న కీర్తి కోసం మరియు తమిళ ఎంటర్టైన్మెంట్ ను ఇష్టపడే సినీ ప్రియులను ఈ సినిమాను సంతృప్తి పరిచేలా కనపడుతోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories