సోషల్ మీడియాలో తన కుటుంబం గురించి, పిల్లల గురించి భావాలను పంచుకునే క్రమంలోనే… మాజీ భర్త పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు రేణుదేశాయ్. అయితే దీనిపై పలువురు నెటిజన్లు కాస్త అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేస్తుండడంతో… విసుగుచెందిన రేణు, తాజాగా ఓ ఇంటర్వ్యూను పోస్ట్ చేస్తానని చెప్పింది. అయితే, ఆ ఇంటర్వ్యూ అందరికీ కాదంట… కేవలం సోషల్ మీడియాలో వెకిలి చేష్టలు చేసేవారికేనట. ఇంతకీ రేణుదేశాయ్ ఏం చెప్పిందో చూద్దాం…
“హాయ్, ఈ రోజు సాయంత్రం ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూను పోస్ట్ చేస్తాను. అందులోని విషయం నన్ను ఆదరించి, నా మంచి కోరే అభిమానులను ఉద్దేశించి కాదు. అది ఫేస్ బుక్, ట్విట్టర్ లో నా వ్యక్తిగత జీవితం గురించి వెకిలిగా ప్రవర్తిస్తున్న వారిని ఉద్దేశించినది. ఈ వీడియో చూసాక అయినా వాళ్ళల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. నా నిజమైన అభిమానులకు నేను ఎప్పుడూ కృతజ్ఞురాలునే…” అంటూ తన భావాలను వ్యక్తపరిచింది.
బహుశా ఓ వర్గం వారితో రేణు తీవ్రంగా బాధపడుతున్నట్లున్నారు. ఆందుకే వారికి మరింత స్పష్టత ఇచ్చే ఉద్దేశంలో భాగంగానే ఓ వీడియో ఇంటర్వ్యూను పోస్ట్ చేయనున్నారు. గతంలో కూడా ఇలాగే ఓ ఇంటర్వ్యూను పోస్ట్ చేసి, కొంత స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ, వారిలో మార్పు రాకపోవడంతో మరో ఇంటర్వ్యూకు సిద్ధమైనట్లుగా కనపడుతోంది. మరి ఏం చెప్పనుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.



