నాయుడు గారితో రెడ్డి గారు…!

Revanth Reddy-Chandrababu Naidu Bond

బాబు – రేవంత్ ల బంధం రాజకీయానికి మాత్రమే పరిమితం కాలేదు అనేది పలు సమయాలలో, సందర్భాలలో బహిర్గతం అవుతూనే వస్తుంది.

సహజంగా పార్టీ మారిన నాయకులు తమ గత పార్టీ పైనా ఆ పార్టీ అధినేత మీద విమర్శనా బాణాలు సంధిస్తారు, అలాగే తమ రాజకీయ ఎదుగుదలకు చేయూత నిచ్చిన చేతులను ఛీత్కరిస్తారు.

ADVERTISEMENT

కానీ రేవంత్ విషయంలో రాజకీయాలలో సహజంగా జరిగే పరిణామాలకు పూర్తి విరుద్ధంగా రేవంత్ టీడీపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరే నిర్ణయం నుంచి నేడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మారిన సందర్భం వరకు ఎన్నడూ టీడీపీ పై విమర్శలు ఎక్కుపెట్టలేదు, బాబుని దోషిగా చిత్రీకరించలేదు.

అలాగే తన ఈ ఎదుగుదలలో టీడీపీ పాత్ర, బాబు ప్రోత్సహం ఉందంటూ పలు సందర్భాలలో ప్రకటించారు, అందుకు తగ్గట్టే అవకాశం చిక్కినప్పుడల్లా టీడీపీ తో తనకున్న సంబంధం, బాబు తో ఉన్న అనుబంధాన్ని బయటపెడుతూనే వస్తున్నారు.

తెలంగాణ రాజకీయాలలో పసుపు జెండా తో స్నేహం అన్నా, సైకిల్ గుర్తుతో దోస్తీ అన్నా, బాబు తో మాటామంతి కలపడం అన్నా అది తెలంగాణ వ్యతిరేక నిర్ణయం కిందే పరిగణించే బిఆర్ఎస్ దాన్ని అలాగే ప్రచారం చేస్తుంది కూడా.

ఇక ఆ ప్రచారమే తన ఆయుధంగా మలచుకుంటూ ఇన్నాళ్లు టీడీపీ పార్టీ పేరును కూడా తెలంగాణ రాజకీయాల నుండి చెరపగలిగింది. అటువంటి టీడీపీ తో ఆ పార్టీ అధినేత తో రేవంత్ చాల బహిరంగంగా, నిర్భయంగా చనువుగా ఉండగలుగుతున్నారు, బాబు పై తన కున్న ప్రేమను చూపించగలుగుతున్నారు.

ఈనాడు అధిపతి రామోజీరావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే చోట కలిసి కనిపించారు, అలాగే వారి మధ్య ఉన్న అన్యోన్యత, ఆప్యాయత మరోసారి చూపించారు.

రామోజీ ఎక్స్ లెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అథిధులుగా హాజరయిన ఈ ఇరువురు ముఖ్యమంత్రులు ఒకరిపక్కన ఒకరు కూర్చుని సరదా నవ్వుకుంటూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ దృశ్యాలు ఇటు రేవంత్ అభిమానులతో పాటుగా అటు టీడీపీ మద్దతుదారులకు సైతం ఆనందాన్ని పంచుతున్నాయి. అయితే గత బిఆర్ఎస్ హయాంలో రావు గారితో రెడ్డి గారి తెరచాటు స్నేహం ఉంటె నేడు కాంగ్రెస్ హయాంలో నాయుడి గారి తో రెడ్డి గారి దోస్తీ కొనసాగుతుంది.

మరి వీరి నవ్వులు వారి ఏడుపులకు కారణం కాబోతున్నాయా.? నాయుడి గారితో రెడ్డి గారి మాటామంతి రావు గారితో రెడ్డి గారి చర్చల వరకు వెళ్లనున్నాయా.?

ADVERTISEMENT
Latest Stories