అభినందనలు అందరు ఇచ్చారు.. మరి సహకారం..?

CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్రంలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువలా వచ్చాయి. అయితే అభినందించించడానికి అందరికి అవసరం, అవకాశం రెండు ఉంటాయి. కానీ ఇందులో కొత్త ప్రభుత్వానికి సహకరించే వారు ఎందరో అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు దొరకనుంది.

ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా, మంత్రులుగా నేడు ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ నాయకులకు బిఆర్ఎస్ ముఖ్య నేత అయినా హరీష్ రావు తన అభినందనలు తెలియ చేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని,కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ తన X మాధ్యమంలో పోస్ట్ చేశారు. అలాగే మెగా స్టార్ చిరంజీవి కూడా రేవంత్ కు తన అభినందనలు తెలియచేసారు.

ADVERTISEMENT

టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే లోకేష్, జనసేన అధినేత పవన్ కూడా రేవంత్ కు తమ శుభాకాంక్షలను తెలియచేసారు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా తెలంగాణ నూతన ప్రభుత్వానికి తన శుభాకాంక్షలు తెలియచేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదర భావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అంటూ తన సోషల్ మీడియా వేదికగా తెలియచేసారు.

అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఆమధ్య సోదర భావం, సహకారం కుదరాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తన మంత్రులతో, తమ పార్టీ నాయకులతో కించపరిచేలా వ్యాఖ్యానించడమేనా? లేక రేవంత్ లో ఇప్పటికి టీడీపీ డీఎన్ఏ నే ఉంది అంటూ విమర్శించడమేనా? అంటున్నారు టీడీపీ మద్దతుదారులు. “అభినందనలు – సహకారం”అనేది రాసే మాటలలో కాదు చేసే చర్యలలో కనపడాలి అప్పుడే రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఆమధ్య సఖ్యత సాధ్యపడుతుంది అంటున్నారు రేవంత్ అభిమానులు.

ADVERTISEMENT
Latest Stories