తెలంగాణలో ఏర్పడిన నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పథకాన్ని అమలు చేసింది. ‘మహాలక్ష్మి’ పేరుతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశంశలతో పాటుగా అప్పుడే కొత్త చిక్కులు మొదలయ్యాయి.
విషయానికి వస్తే..,నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తమ పార్టీ అధినేత సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రమంతా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ కు దివ్యాంగుల నుంచి అర్జీ రానేవచ్చింది. కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో ప్రకటించినట్లుగానే దివ్యాంగులకు కూడా వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలి అంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తులు మొదలయ్యాయి.
అప్పుడే కొత్త ప్రభుత్వానికి కొత్త పథకం ద్వారా కొత్త చిక్కులు మొదలయ్యాయి అంటున్నారు రాష్ట్రవాసులు. మరి ఈ సమస్య దివ్యాంగులతో ఆగుతుందా లేకా ఇంకా ముందుకు వెళుతుందో వేచి చూడాలి.ఇప్పటికే ఈ ఉచిత ప్రయాణం ఎఫెక్ట్ మా ఉపాధి మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది అంటూ ఒక పక్క ఆటోవాలాలు తమ గొడ్డుని ప్రభుత్వానికి వినిపించారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ ఎవరిని నొప్పించక తానిచ్చిన మాట తప్పక సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.




