వర్మ కెలుకుతోంది “మామూలు” విషయం కాదు!

ram gopal varma vangaveeti radha krishnaసంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించిన “వంగవీటి” టైటిల్, సినీ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. వంగవీటి రాధతో ప్రారంభమైన ప్రస్థానం రంగాతో ఎలా ముగిసిందో… ఉన్న నిజాలను కళ్ళకు కట్టినట్లుగా తీస్తానని వర్మ చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. ఎందుకంటే వర్మ కదుపుతోంది ఒక సాధారణ తేనెతుట్టను కాదు, గతంలో “రక్తచరిత్ర”తో సీమ ఫ్యాక్షనిజాన్ని చూపించినా అది కేవలం “కక్ష్యపూరిత” రాజకీయాల వరకే పరిమితమైంది.

కానీ, బెజవాడ వేదికగా జరిగిన “వంగవీటి” ప్రస్థానంలో ‘రివెంజ్’తో పాటు రెండు సామాజిక వర్గాల మధ్య పోరు కూడా ఉంది. దీంతో ఆరిపోయిన ‘కార్చిచ్చు’ను వర్మ మళ్ళీ రేపుతారా? అన్న రీతిలో చర్చలు జరుగుతున్నాయి. వంగవీటి కుటుంబానికి దేవినేని వంశీయులకు ఉన్న అనుబంధం విడదీయలేనివి. ఏ ఒక్కరిని కదిపినా మరొకరు ఆటోమేటిక్ గా కధలోకి ఎంటరైపోతారు.

వంగవీటి రాధ ఎవరిని చంపారు? ఆ తర్వాత రాధను ఎవరు చంపారు? ఇక, రంగా ప్రవేశించిన తర్వాత ఎటువంటి రివేంజ్ తీర్చుకున్నారు. ఇక్కడివరకు క్రియాశీల రాజకీయాలకు దూరంగా కధ నడించింది. కానీ, రంగా హత్యోదంతం మాత్రం పూర్తి రాజకీయ రంగు పులుముకుంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ ఆ సమయంలో ఏం చేసారు? అలాగే ఇటీవల హరిరామజోగయ్య ఏపీ సిఎం చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు ఈ సినిమా ఏమైనా జవాబిస్తుందా? కాంగ్రెస్ లో ఓ శక్తిగా ఎదుగుతున్న రంగాను చూసి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎలా స్పందించారు?

ఇలా వంగవీటి మోహన రంగా హత్యోదంతం ప్రస్తుత రాజకీయాలను కూడా శాసించే విధంగా ఉండడంతో వర్మ ఈ పాత్రలన్నింటినీ ఎలా చూపిస్తారు? అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ సినిమాలో అన్ని నిజాలే చెప్తానన్న వర్మ, జరిగిన కధను వక్రీకరించకుండా తీసే దమ్ముందా? అయితే వర్మ మనసుపెట్టి సినిమా తీస్తే, అది “రక్తచరిత్ర” పార్ట్ 1 మాదిరి ఉంటుంది కాబట్టి, ఈ “వంగవీటి” సినిమాను కూడా వర్మ ఎంతో మనసుపెట్టి తీయాలని విజయవాడ వాసులు కోరుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories