టాలీవుడ్ లో కలకలం… మెగా కాంపౌండ్ కీలక ప్రకటన..?

RGV---Sri-Reddy-Controversyకాస్టింగ్ కౌచ్ పై చేస్తున్న పోరాటంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను లాగమని హీరోయిన్ శ్రీరెడ్డికి చెప్పింది తానేనని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మకు మెగా కాంపౌండ్ కు చెందిన బన్నీ వాసు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూల్ గా ఉండాలని తాము ఎప్పుడూ కోరుతుంటామని… కానీ ఇప్పుడు నీవు ఆడిన డ్రామా మొత్తం తెలుసుకున్న తర్వాత ఇక ఫ్యాన్స్ ను ఆపే ప్రయత్నం చేయబోమని వాసు చెప్పాడు.

మేమంతా బయటకు వస్తున్నామని… యుద్ధానికి సిద్ధంగా ఉండాలని వర్మను హెచ్చరించాడు. మా సత్తా ఏంటో నీకు రుచి చూపిస్తామని, మెగా ఫ్యామిలీ మద్దతుదారులంతా ఈ రోజు సమావేశం కాబోతున్నామని… సాయంత్రం మా నిర్ణయం ఏమిటో ప్రకటిస్తామని చెప్పాడు. ఫేస్ బుక్ వేదికగా బన్నీ వాసు చేసిన ఈ కామెంట్స్ తో టాలీవుడ్ లో కలకలం రేగింది. వర్మ విషయంలో మెగా కాంపౌండ్ ఓ నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా స్పష్టమవుతోన్న మరో విషయం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories