‘స్కర్ట్’లో ఎమ్మెల్యే… రాజకీయాలకు మంచి రోజులు..!

assam beauty BJP MLA  angoorlata dekaసినిమాలు, మహిళలు అంటే చెవి కోసుకునే దర్శకుడు రాంగోపాల్ వర్మ మనసు ఒక్కసారిగా రాజకీయాల వైపుకు మళ్ళింది. అది కూడా ఏ తెలుగు రాష్ట్రమో లేక ప్రస్తుతం తను నివసిస్తున్న ముంబై నగర రాజకీయాలను చూసో కాదు, దేశపు అంచున ఉన్న అస్సాం రాష్ట్ర రాజకీయాలను చూసి! మరి ఇంతగా వర్మను రాజకీయాల వైపుకు మలిచింది ఎవరు… అంటే దానికి సమాధానమే అంగూర్ లతా.

ADVERTISEMENT

అస్సాం బ్యూటీగా పేరు గాంచిన అంగూర్ లతా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. అస్సాంలోని బాటద్రోబ నియోజకవర్గం నుండి పోటీచేసి ఘనవిజయం అందుకుంది. దీంతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ బ్యూటీ ఫోటోను షేర్ చేసిన రాంగోపాల్ వర్మ… రాజకీయాలను మంచి రోజులు వచ్చేసాయని కీర్తించారు.

స్కర్ట్ లో ఉన్న లతా ఫోటో పక్కనే ఎమ్మెల్యే గెటప్ లో ఉన్న లతా ఫోటోను పోస్ట్ చేసిన వర్మ… “ఒక ఎమ్మెల్యే ఈ విధమైన లుక్ ఇవ్వగలిగితే… అచ్చే దిన్ ఆగయే హై… థ్యాంక్యూ అంగూర్ లతాజీ… థ్యాంక్యూ మోడీజీ… మొదటిసారిగా రాజకీయాలను ప్రేమిస్తున్నాను…” అంటూ ట్వీట్ చేసారు. వర్మ అంటేనే సంచలనం… సంచలనం అంటే వర్మ..! అలాంటి వర్మ నుండి ఈ రకమైన ట్వీట్ ఊహించదగ్గదే..!

ADVERTISEMENT
Latest Stories