ట్రైలర్ టాక్ – మరో ‘రక్తచరిత్ర’తో వర్మ ఈజ్ బ్యాక్!

vangaveeti-trailer-talkమనసు పెట్టి వర్మ సినిమాలకు దర్శకత్వం వహిస్తే… అవి ఏ రేంజ్ లో ఉంటాయో అనే విషయం ‘రక్తచరిత్ర’ పార్ట్ 1 సినిమా నిరూపించింది. తాజాగా అలాంటి అనుభూతినే “వంగవీటి” సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులకు పంచుతోంది. విజయవాడ చరిత్రలో ‘వంగవీటి’ ప్రస్థానాన్ని వెండితెర రూపం దాల్చిన వర్మ… 70, 80వ దశకం నాటి రౌడీయిజాన్ని, రాజకీయాన్ని అద్భుతంగా చూపించినట్లుగా కనపడుతోంది.

ADVERTISEMENT

వర్మ మార్క్ టేకింగ్ లో కొత్త కొత్త నటులంతా ఆయా పాత్రల్లో ఇమిడిపోయినట్లుగా దర్శనమిస్తున్నారు. సందీప్, వంశీ, కౌటిల్య ప్రధాన పాత్రల్లో నటించగా, వర్మ మార్క్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే బ్యాక్ గ్రౌండ్ వర్మ పాడిన పాట కాస్త కర్ణకఠోరంగా ఉన్నప్పటికీ, సన్నివేశాలతో రక్తి కట్టించడంలో ట్రైలర్ సక్సెస్ అయ్యింది. ‘గాంధీ జయంతి’ సందర్భంగా విడుదలైన విజయవాడ ‘రక్తచరిత్ర’ పెద్ద సంచలనానికే దారి తీసేలా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories