సేఫ్టీ ఎక్కడ.?

Travel safety concerns

ఇంట్లో నుంచి పని మీద రోడ్డు మీదకొచ్చిన మనిషి తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుతున్నాడా.? మనిషి ప్రాణానికి, ఆయన ప్రయాణానికి సేఫ్టీ ఉందా.? నిత్యం వార్తలలో కనిపించే కొన్ని హృదయవిదారక దృశ్యాలు చూస్తుంటే ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ రోజు ఉదయం ఒంటిగంటకు టాటా నగర్ నుంచి ఎర్నాకుళం బయలుదేరిన ఎక్సప్రెస్ లో రైలులోని రెండు ఏసీ బోగీలు బి-1, ఎం -2 పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు సజీవదహనం అవ్వగా మిగిలిన వారు సురక్షితంగా బయటపడినట్టు సమాచారం.

ADVERTISEMENT

విశాఖ నుంచి బయలుదేరిన ఎర్నాకుళం అనకాపల్లి, యలమంచిలి దగ్గర ఈ ప్రమాదం జరగడంతో వెంటనే ఎలర్ట్ అయినా ఫెయిర్ సిబ్బంది సుమారు 2 గంటలు శ్రమించి ఆ మంటలను ఆర్పీ వేశారు.

ఈ మధ్యకాలంలో అదేదో ట్రెండ్ మాదిరిగా వరుస బస్సు ప్రమాదాలు ఎంతోమందిని సజీవ దహనం చేయగా, మరికొన్ని ప్రమాదాలలో మరెంతోమంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇలా ఈ ప్రమాదాలు, అనుకోని ఘటనలు చాల కుటుంబాలలో తీరని విషాదాన్ని మిగిల్చాయి, ఎందరో తల్లులకు కడుపు కోతను తెచ్చిపెట్టాయి.

ఇక అతి వేగం, మద్యం మత్తులో రోడ్ల మీదకు వచ్చే కొందరు వారి ప్రాణాలతో పాటు ఏ తప్పు చేయని, ఏ పాపం ఎరుగని మరి కొంతమంది అమాయకులను మరణానికి చేరువ చేస్తున్నారు.

ఇక ఈ 2025 లో జరిగిన అతిపెద్ద ఘోర ప్రమాదం అంటే అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన క్రాష్ అనే చెప్పాలి. ఈ ప్రమాదంలో 12 మంది సిబ్బంది తో సహా 230 ప్రయాణికులలో ఒక్కరు మాతర్మే ప్రాణాలు బయటపడ్డారు. ఇక ఆ ఎయిర్ ఇండియా విమానం ఒక మెడికల్ హాస్టల్ భవనం పై కుప్పకూలడంతో ఆక్కడ ఉన్న విద్యార్థులలో కొన్తమంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గాయలపయ్యారు.

ఇలా ఒక మనిషి ప్రయాణానికి, వారి ప్రాణాలకు అటు కార్లు, బైకులు, బస్సులు, విమానాలు అంటూ ఏ ఒక్క చోట కూడా సేఫ్టీ అనేది లేకుండా పోయింది.

ADVERTISEMENT
Latest Stories