లైవ్ షోలో రోజా – బండ్ల గణేష్ బూతు పురాణం

Roja-Bandla-Ganesh-tv9 live debateతెలుగు టీవీ చరిత్రలో మరో కొత్త దిగజారుడుతనం. లైవ్ షోలో బూతు పురాణం మొదలుపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా మరియు సినీనిర్మాత బండ్ల గణేష్. సభ్యసమాజం తలదించుకునేలా సాగిన తంతు. వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ఇటీవలే చేసిన టూర్, ఆ సందర్భంగా సంధించిన బాణాలు, దానికి వైకాపా రెస్పాన్స్ పై టీవీ9లో ఒక చర్చ కార్యక్రమం జరిగింది.

పవన్ కళ్యాణ్ తరపున బండ్ల గణేష్ ని కూర్చోబెట్టగా రోజాని ఫోన్ లైన్లోకి తీసుకున్నారు రజినీకాంత్. ఒకదశలో పవన్ కళ్యాణ్ ని ఏకవచనంతో సంబోదించడంతో వారించిన బండ్ల గణేష్ తొందరగానే నోరుపారేసుకున్నారు. రోజాది ఐరన్ లెగ్ అంటూ రాజశేఖర రెడ్డిని పైకి పంపించావు అంటూ నగిరి ఎమ్మెల్యేను తూలనాడారు.

ADVERTISEMENT

తనేమన్న తక్కువ అంటూ రోజా నువ్వు పవన్ కళ్యాణ్ కి పక్కలేస్తావా అంటూ హేయంగా మాట్లాడటంతో బండ్ల రెచ్చిపోయి “అవును నిన్నూ ప‌డుకోబెడ‌తా” అన్నాడు. ప‌ళ్లు రాలిపోతాయ్ అని రోజా.. నీ ప‌ళ్లు రాల‌గొడ‌తా అంటూ బండ్ల గ‌ణేష్‌ సభ్యసమాజం సిగ్గుపడేలా ఒకరిమీద ఒకరు వీరంగం ఆడారు.

మెరుగైన సమాజం కోసమంటూ గొప్పలు చెప్పే టీవీ9 ఇదంతా లైవ్ టెలికాస్ట్ చేసి ఎప్పటిలానే తన ప్రత్యేకత చాటుకుంది. ఇటువంటి మాటలు అటు రోజాకు, బండ్ల గణేష్ కు, ఇటు టీవీ9కు కొత్తేమి కాకపోయినా చూసేవారికి మాత్రం జుగుప్సగా అనిపించక మానదు. 2019 ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఇంకెన్ని సిత్రాలు చూడాలో!

ADVERTISEMENT
Latest Stories