
జీవితంలో ఒక్కసారైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చాలనుకున్నారు జగన్… ఐదేళ్ళు కూర్చుని దిగిపోయారు. జీవితంలో ఒక్కసారైనా ‘మంత్రి రోజా’ అని పిలిపించుకోవాలని ఆరాటపడ్డారు… ఆ ముచ్చతా తీర్చుకున్నారు. కనుక తాము చేసిన ఘన కార్యాలకు సంతృప్తిగా వెళ్ళిపోవాలి. కానీ నిన్న మొన్నవరకు ‘ఋషికొండ ప్యాలస్’ కబుర్లు చెప్పిన వైసీపి నేతలందరూ ఇప్పుడు ‘ఈవీఎం… ఈవీఎం…’ అనే కొత్త పాట మొదలు పెట్టేశారు.
Also Read – వైసీపీ కి ఆ అర్హత ఉందా.? కానీ జనసేన బాధ్యత..!
ఓపక్క మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వంటివారు ‘మా నోటి దూల కారణంగానే ప్రజలు మమ్మల్ని అసహ్యించుకొని ఓడించారని చెపుతూనే ఉన్నా రోజా వంటివారు పట్టించుకోలేదు.
కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి ముదుర్లే మీడియా ముందుకు రావడానికి ఇంకా జంకుతుంటే రోజా మాత్రం అప్పుడే ఫామ్‌లోకి వచ్చేశారు.
Also Read – జీఎస్టీ ఆదాయం తగ్గితే.. సిగ్గు పడాల్సింది బాబు కాదు.. జగనే!
ఆమె మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో 40 శాతం ఓట్లు వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. లోక్‌సభ ఎన్నికలలో 40 శాతం వచ్చిన నరేంద్ర మోడీ ప్రధాని కాగలిగారు. కానీ ఏపీలో 40 శాతం వచ్చిన జగన్‌కు కేవలం 11 సీట్లు మాత్రమే రావడం ఏమిటి?టిడిపి కూటమి ఎన్నికలలో ఎలా గెలిచిందో చిన్న పిల్లాడిని అడిగినా చెపుతాడు,” అంటూ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వలననే వారికి 164 సీట్లు వచ్చాయన్నట్లు మాజీ మంత్రి రోజా మాట్లాడారు.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యమే అయితే ఆ మిగిలిన 11 సీట్లు కూడా టిడిపి, జనసేన, బీజేపీలే వేసుకునేవి కదా?
Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..
తెలంగాణలో రేవంత్ రెడ్డి లేదా కేసీఆర్ లేదా బీజేపీలు 119కి 119 సీట్లు తమకే వేసుకునేవారుగా? అలాగే ప్రధాని మోడీ చేతిలో కేంద్ర ఎన్నికల కమీషన్ ఉన్నందున ఈవీఎంలను మేనేజ్ చేసుకొని 400-500 సీట్లు వేయించుకునేవారేగా? కానీ 293 సీట్లు మాత్రమే వచ్చాయి… అదీ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడులు మద్దతు ఇస్తే!
ఇక రోజా అతి తెలివిగా మాట్లాడి లెక్కల్లో చాలా వీక్ అనే విషయం స్వయంగా బయటపట్టుకున్నారు.
గత ఎన్నికలలో వైసీపికి 49.95% ఓట్ షేరుతో 151 సీట్లు రాగా, టిడిపికి 39.17% ఓట్ షేరుతో 23 సీట్లే వచ్చాయి.
ఈసారి ఎన్నికలలో వైసీపికి 39.37% ఓట్ షేరుతో కేవలం 11 సీట్లు రాగా, టిడిపి (45.60%), జనసేన (6.85%), బీజేపీ (2.83%) కలిపి 55.28% శాతం ఓట్ షేరుతో 164 సీట్లు వచ్చాయి.
ఎన్నికలలో విజయానికి, ప్రభుత్వం ఏర్పాటుకి సీట్లే కొలమానం అనే చిన్న విషయం కూడా తెలియకుండా రోజా మంత్రి ఎలా అయ్యరో?