ఓడితే కన్నీళ్ళు ఓకే! గెలిచామని నవ్వి ఏడిస్తేనే…

RK Roja protests at MPTC election counting centre

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కొన్ని చోట్ల వైసీపీ గెలిచినప్పటికీ చాలా వరకు తుడిచి పెట్టుకుపోయింది. కనుక వైసీపీ నేతలు, అభ్యర్ధులు బాధపడటం సహజం.

అయితే ఓడిపోతున్నామని తెలిసి కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద రోజా వంటి వైసీపీ నేతలు అక్కడ డ్యూటీలో ఉన్న అధికారులతో వాగ్వాదాలకు దిగడం, మీడియా కెమెరాలను చూసి అన్యాయం, అక్రమం అంటూ రభస చేయడం, తర్వాత కన్నీళ్ళు పెట్టుకోవడం చాలా నాటకీయంగా అనిపిస్తాయి.

ADVERTISEMENT

తన నియోజకవర్గంలో ఇల్లతూరు ఎంపీటీసీగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి గెలిచినా, ఓడిపోయారని, ఓడిపోయినా టీడీపి అభ్యర్ధి గగెలిచినట్లు ప్రకటించారంటూ రోజా కౌంటింగ్ కేంద్రం వద్ద కూర్చొని కాసేపు ధర్నా చేశారు.

ఈ విషయం తెలుసుకొని ఎన్నికల అధికారులు అక్కడకు చేరుకొని, అటువంటిదేమీ జరుగలేదని ఆమెకు నచ్చజెప్పబోతే ఆమె వారిపై కూడా ఫైర్ అయ్యారు.

ఇంతగా రెచ్చిపోయిన ఆమె అంతలోనే కన్నీళ్ళు పెట్టుకోవడం, మళ్కొళీ ఆవేశంగా నినాదాలు చేయడం చూసినప్పుడు ఆమె సినిమాలలో, రియాల్టీ షోలలో ఇలా అప్పటికప్పుడు వివిధ హావభావాలు ప్రదర్శిస్తూ నటిస్తే అందరూ హర్షిస్తారు. కానీ ఇలా బయట కూడా నటించేస్తుంటే ఎవరూ హర్షించరు. నవ్వుతారని ఇంకా ఎప్పుడు గ్రహిస్తారో?

ADVERTISEMENT
Latest Stories