రోజా పువ్వు కింద ముళ్ళున్నట్టే ఈ వైసీపీ నేత నగరి రోజా నోటి నిండా బూతులు ఉంటాయి. వైసీపీ నాయకులలో ప్రజలకు సేవ చేసి పాపులర్ అయిన నాయకుల పేర్లు చెప్పమంటే ఆలోచించాలి కానీ మీడియాలో ప్రతిపక్ష నేతలను బూతులతో దూషించే నేతల పేర్లు చెప్పమంటే రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టో లిస్టులంతా ఉంటారు.
అందులో మంత్రి రోజా ఒకరు. అయితే నేడు ఎన్నికల సందర్భంగా నగరి పోలింగ్ బూత్ ను సందర్శించిన రోజా ముఖంలోనూ, మాటలోనూ ఓటమి ఛాయలు స్పష్టంగా కనపడ్డాయి. తనకు టీడీపీ తో ఎటువంటి ఇబ్బంది లేదని, తన ఓటమి కోసం సొంత పార్టీ నేతలే సైకిల్ కు ఓటేయమంటూ ప్రలోభ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మే 12 వరకు రోజా గొంతులో ఉన్న కాన్ఫిడెన్స్, ముఖంలో కనపడిన రాజసం ఈ రోజుతో ఆవిరయినట్టే కనపడుతుంది. అసలు ఈసారి రోజాకు అసెంబ్లీ టికెట్ రాకుండా అడ్డుకోవడానికి స్థానిక వైసీపీ నేతలు సర్వ శక్తులు ఒడ్డినా వారి ఆశల పై నీళ్లుజల్లారు జగన్. కేవలం బాబు, పవన్, లోకేష్ ను విచక్షణ రహితంగా దూషించినందుకే రోజాకు ఈ అవకాశం దక్కిందని వార్తలు కూడా ఊపందుకుంది.
అప్పుడు నోటికి పని చెప్పి దక్కించుకున్న తన నగరి సీటుని ఎలా అయినా ఓడించాలనే పట్టుదలతో ఉన్న స్థానిక వైసీపీ నేతలు అవకాశం చూసుకుని రోజాకు గట్టి దెబ్బకొట్టారు అనేది రోజా మాటలలో స్పష్టంగా కనపడుతుంది. 2019 ఎన్నికలలో విజయం సాధించిన తరువాత కన్నీరు కార్చిన రోజా ఆ కన్నీటికి ఆనంద బాష్పాలు అని పేరు పెట్టారు. మరి ఇప్పుడు జూన్ 4 తరువాత తన కంటి నుండి కారే కన్నీటికి ఏ పేరు పెడుతుందో..?






