
అధికారంలో ఉంటే ఒక లెక్క ప్రతిపక్షంలో ఉంటే మరో లెక్క అనేది వైసీపీ రాజకీయంలో ఒక భాగం. ప్రతిపక్షములో ఉంటే ప్రజలకు సేవ చెయ్యడానికి, సమాజంలో అసమానతలు రూపుమాపడానికి ఒక్క అవకాశం కావాలి అంటూ ప్రజలకు హగ్గులు, ముద్దులు ఇస్తుంటారు వైసీపీ అధినాయకుడు జగన్ మొదలు ఆ పార్టీ నాయకులంతా.
అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీ మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితమయ్యింది. అలాగే ప్రజలు కూడా తమకు ఆనాటి హగ్గులు, ముద్దులు మళ్ళీ తిరిగొచ్చేస్తాయనుకుంటే ఆ పార్టీ మహిళా నాయకురాలు నగరి రోజా తన వాస్తవిక రూపాన్ని బయటపెట్టింది. ఎన్నికల ముందు నగరి గడ్ద రోజా అడ్డా అంటూ విర్రవీగిన రోజా పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అంటూ శపధాలు చేసింది.
Also Read – అభిమానుల కలల సీజన్ ఇదేనా..?
ఎన్నికల ఫలితాల తరువాత ఓటర్లు ఇచ్చిన షాక్ తో నగరి నుండి కాదు కదా తన ఇంటి గేటు నుండి కూడా బయటకు రాలేకపోతున్నారు ఈ మాజీ మంత్రి. మాజీ పర్యాటక శాఖ మంత్రిగా పొరుగు రాష్ట్ర పర్యటనకు, తమిళనాడులోని తిరుచ్చెందుర్ సుబ్రమణ్య స్వామి ఆలయానికి ఆమె భర్త సెల్వమణితో పాటు వెళ్లిన రోజా అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రోజాను చూసి ఆమెతో ఒక ఫోటో తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ ఆలయంలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు రోజా వద్దకు వెళుతుండగా రోజా వారిని అడ్డుకునే ప్రయత్నం చేసారు. అక్కడే ఆగాలి, దగ్గరకు రావద్దు అన్నట్టుగా ఒక సైగ రూపంలో రోజా వారిని వారించారు. దీనితో రోజా మరోసారి తన బుద్దిని బయటపెట్టింది అంటూ రోజా పై మండిపడుతున్నారు.
Also Read – సమంతకు గుడి కట్టిన అభిమానం
గతంలో కూడా ఒక నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటు రోజా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసి ఎస్సి , ఎస్టీల మీద తనకున్న అభిప్రాయాన్ని వెల్ళబుచ్చారు. మేమేమి ఎస్సి, ఎస్టీలం కాదండి, దగ్గరకు రావచ్చు అంటూ అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారి పై తన కులాహంకారం ప్రదర్శించారు.
ఇప్పుడు కూడా పారిశుద్ధ్య కార్మికులు తనను తాకకుండా వారిని వారించింది రోజా. అంటే రోజా దృష్టిలో ఇంకా అంటరాని తనం నేరం కాదని భావిస్తుందా? ఎస్సి, ఎస్టీలను తాకకూడదు అంటూ ఒక సారి వ్యాఖ్యానించిన రోజా తన మాటలకు కట్టుబడే ఇప్పుడు వీరిని దూరం జరగమని చెప్పారా.? పరిశుద్ధాయ కార్మికులంటే రోజాకు ఇంత చిన్న చూపా అంటూ రోజా వైఖరిని ఎండగడుతున్నారు.
Also Read – బిఆర్ఎస్..కాంగ్రెస్ కుర్చీల ఆటలో బీజేపీ అరటిపండా.?
ఎన్నికలొచ్చినప్పుడు నా ఎస్సిలు, నా ఎస్టీలు అంటూ వారి కాలనిలో ఎన్నికల ప్రచారాలు చేసుకుని వారి పిల్లలను ఎత్తుకుని, వారికి హగ్గులు ఇచ్చి, ఫోటోలకు ఫోజులిచ్చి తమ వైపు ఆకర్షించుకునే రోజా ఇప్పుడు మాత్రం “అన్ టచ్ బుల్” అంటూ సైగలు చెయ్యడంలో అర్థమేమిటి? అంటే రోజా దృష్టిలో ఎస్సి, ఎస్టీ ప్రజలు ఓటు బ్యాంకు మాత్రమేనా?
ప్రతి ఐదేళ్లకొకసారి మాత్రమే రోజా గారికి వీరితో అవసరం వస్తుందన్న మాట.! ప్రజా జీవితంలో ఉన్న రోజా చేసిన ఈ చర్య కచ్చితంగా సమాజం పై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇటువంటి నేతలు అణగారిన ప్రజల మీద తమ కులాహంకారాన్ని చూపిస్తూ రాజకీయాలలో మాత్రం సామజిక న్యాయం అంటూ నీటి ప్రవచనాలు వల్లిస్తుంటారు.
సోషల్ మీడియాలో వైరల్ అయినా రోజా వీడియో ను చూసి రోజా రోజమ్మ…ఆనాటి హగ్గులు ఏవమ్మా..? అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే పార్టీ అధినేతగా జగన్ ఈ విషయంలో రోజా పై తగిన చర్యలు తీసుకోవాలి. తన సొంత పార్టీ నేతలు చేసిన, చేస్తున్న తప్పులను వెనకేసుకు రావడం వల్లనే జగన్ ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కించుకోలేకపోయారు.
ఇకనైనా జగన్ ఘాడ నిద్ర నటించడం మాని తన పార్టీ నేతల మీద వస్తున్న ఆరోపణల పై స్పందిస్తూ తగిన చర్యలు తీసువాలి. లేకుంటే జగన్ కూడా ఈ దుశ్చర్యలను ప్రోత్సహించిన వారికిందకే వస్తారు. ఈ ప్రభావం వైసీపీ రాజకీయ భవిష్యత్ పై పడే అవకాశం లేకపోలేదు.