ఏపీ పోలీసులకు తెలివిగా మస్కా కొట్టిన ఆర్ఆర్ఆర్

RRR going to fight the cases against the government from Delhi.రాజద్రోహం కేసులో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆర్మీ ఆస్పత్రి నుంచి కాసేపటి క్రితం డిశ్చార్జ్ అయ్యారు. విడుదలైన వెంటనే ఆయనను మరో కేసులో అరెస్టు చెయ్యడానికి ఏపీ పోలీసులు సిద్ధం అవుతున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన విడుదల సంగతి గోప్యంగా ఉంచారు.

విడుదలైన వెంటనే బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఆయన నేరుగా ఢిల్లీ బయల్దేరారు.సీఐడీ కోర్టులో షూరిటీ పేపర్లు సమర్పించేందుకు రఘురామకు 10 రోజుల గడువు ఉంది. ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా సమర్పించవచ్చని తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దానితో ఏపీ ప్రభుత్వానికి అటు కోర్టు నుండీ ఇటు ఆర్మీ ఆసుపత్రి నుండీ సమాచారం లేదు.

ADVERTISEMENT

అయితే ఆయన మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి వెళ్తున్నారని సహచరులు అంటున్నారు. ఇక పోతే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండడం ఇక ఏ మాత్రం సేఫ్ కాదని రఘురామకృష్ణ రాజు నిర్ణయించుకున్నారట. గతంలో ఇటువంటి పనికి పాల్పడతారని అనుమానించే ఆయన ఏపీ వెళ్లకుండా తెలంగాణలోనే ఉంటున్నారు.

అయితే ఇటీవలే హైదరాబాద్ లోనే ఆయనను అరెస్ట్ చెయ్యడంతో ఇక తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆయన అనుమానిస్తున్నారు. ఇక పై ఆయన పై పెట్టిన కేసులను… ప్రభుత్వం పై ఆయన పెడుతున్న కేసులను ఆయన ఢిల్లీ నుండే పోరాడబోతున్నారు. సీఐడీ కస్టడీలో తనను కొట్టిన ఘటనపై సిబిఐ విచారణ కోరుతూ ఆర్ఆర్ఆర్ సుప్రీం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ కేసు జులై నెలకు వాయిదా వేసింది కోర్టు.

ADVERTISEMENT
Latest Stories