రాజమౌళి చర్యలు ఊహాతీతం… దట్స్ ది బ్యూటీ..!

SS Rajamouli am Charan NTRజూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించనున్న మల్టీస్టారర్‌కు సంబంధించి మరో వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు అగ్రహీరోలతో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఇండస్ట్రీలో ఇప్పటికే రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరిది ప్రధాన పాత్ర తదితర వాటిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

ADVERTISEMENT

ఈ క్రమంలో తాజాగా మరో వార్త ఇప్పుడు టాలీవుడ్‌ను ఊపేస్తోంది. ఈ సినిమాలో మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా నటించబోతున్నాడన్నదే ఆ వార్త. షూటింగ్ ప్రారంభం కాకముందే హాట్ టాపిక్‌గా మారిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా నటిస్తున్నాడన్న వార్తతో మరింత క్రేజ్ సంపాదించుకుందీ చిత్రం. అంతేకాదు అల్లు అర్జున్ తో పాటు రవితేజ కూడా ఉన్నాడని మరొక వార్త కూడా ప్రచారంలో ఉంది.

ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ విలన్‌ గా నటించబోతున్నాడన్న వార్త కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే రాజమౌళి నుంచి కానీ, ఎన్టీఆర్, చరణ్ వైపు నుంచి కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే రూమర్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఊహాతీతమైనవన్నీ రాజమౌళి విషయంలో సుసాధ్యం అవుతుండడంతో, ఈ పుకార్లకు ప్రాధాన్యత లభిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories