LOL : రాజకీయాల్లోకి టాలీవుడ్ బ్యూటీ!

rumours on samantha akkineni political entry-టాలీవుడ్ అగ్ర కథానాయిక, అక్కినేని వారి కోడలు అయిన సమంత రాజకీయాల్లోకి రానుందని, 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయనుందని సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఈ వార్తలకు వెంటనే బ్రేక్ వేయాలనే ఉద్దేశంతో… ఇందులో వాస్తవం లేదని ఆమె ప్రతినిధులు స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన సమంతకు లేదని తెలియజేసారు.

ADVERTISEMENT

సమంత తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న నేపథ్యంలో… చేనేత అధికారులు నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొనడంతో ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయి. తమిళంలో విశాల్‌ సరసన ‘ఇరుంబుతిరై’ సినిమా, తెలుగులో సుక్కూ – చెర్రీల ‘రంగస్థలం’ మరియు ‘మహానటి, యూటర్న్‌’ సినిమాలతో బిజీబిజీగా ఉంది.

ADVERTISEMENT
Latest Stories