సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్… ఆ డేట్ మార్క్ చేసుకోండి..!

Sachin Tendulkar Biopicఇండియాలో క్రికెట్ ఈ స్థాయిలో ప్రజాధరణ పొందిందంటే దానికి కారణమైన వ్యక్తులలో సచిన్ టెండూల్కర్ స్థానం ఎప్పుడూ నెంబర్ వన్నే. అద్వితీయమైన బ్యాటింగ్ ప్రతిభతో ప్రపంచ దేశాలను తన వైపుకు తిప్పుకున్న సచిన్ పేరు చెప్తే పులకించిపోయే అభిమానుల సంఖ్యకు లెక్కే లేదు. ఇప్పటికీ ఏదొక మ్యాచ్ లో సచిన్ సరదాగా అయినా ఆడాలని అభిమానులు ఆకాంక్షిస్తూనే ఉంటారు. అలాంటి ‘క్రికెట్ దేవుడు’ చరిత్రను ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తోన్న “సచిన్” బయోపిక్ సినిమా కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని జీవిత ఆధారంగా నిర్మాణం అయిన “ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ” 100 కోట్ల కలెక్షన్లు అందిపుచ్చుకుని ఘనవిజయం సాధించడంతో, అందరి చూపులు సచిన్ బయోపిక్ వైపుకు మళ్ళాయి. అయితే అనేక వాయిదాలు తీసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు తన విడుదలను ఖరారు చేసుకుంది. ఇప్పటికీ చాలా సమయం ఉన్నప్పటికీ, విడుదల తేదీ మాత్రం ఫిక్స్ అయ్యింది. 2017, మే 26వ తేదీ శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా సచిన్ టెండూల్కర్ బయోపిక్ సినీ ప్రేక్షకులను పలకరించబోతోంది.

ADVERTISEMENT

సచిన్ కున్న అభిమానులు రీత్యా బాక్సాఫీస్ వద్ద, ఈ సినిమా కూడా కనకవర్షం కురిపిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు సచిన్ బ్యాటింగ్ చూసి ముగ్ధులైన క్రీడాభిమానులంతా, మే 26వ తేదీ నుండి సచిన్ జీవిత చరిత్రను వెండితెరపై చూసి ముగ్ధులవ్వమని చిత్ర యూనిట్ కోరుతోంది. సచిన్ బ్యాటింగ్ చూడమని ఏ అభిమానికైనా చెప్తే ఎలా ఉంటుందో… ఈ సినిమాను చూడమని అభిమానులను కోరడం కూడా అలాగే ఉంటుందని చెప్పకతప్పదు. సచిన్ సాధించిన రికార్డులు అలాంటివి… భారత జట్టుకు అందించిన సేవలు అలాంటివి..!

గత దశాబ్దన్నర్ర కాలంగా జట్టులో మ్యాచ్ విన్నర్లు అంటే… కోహ్లి, ధోని, యువరాజ్, రైనా, రోహిత్, గంగూలీ వంటి పేర్లు వినిపించేవి. కానీ, సచిన్ ఆడిన రోజుల్లో… జట్టులో ‘మ్యాచ్ విన్నర్’ ఎవరంటే… ఒక్క సచిన్ పేరే వినిపించేది. అది సచిన్ తరానికి, ఇప్పటితరంలో రాణిస్తున్న జట్టుకు ఉన్న తేడా..!

Sachin Tendulkar Biopic (2)

ADVERTISEMENT
Latest Stories