సౌమ్యమూర్తి సజ్జల లీలలు ఎన్నెన్నో?

ycp

జగన్‌కు శల్యసారధ్యం చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు చాలా మేధావిలాగా, నిష్కళంకమైన రాజకీయ నాయకుడిలాగా, ఎంతో సౌమ్యమూర్తిలాగ బిల్డప్ ఇచ్చేవారు. ఆయన వితండవాదం చేస్తున్నారని అర్దమవుతున్నప్పటికీ ఆయన చాలా చక్కగా, మృధువుగా చెపుతుంటే నిజమేనేమో? అని ప్రజలకు అనుమానం కలిగేది.

ADVERTISEMENT

కానీ సినిమాలలో మొదట చాలా మంచివాడు కనిపించి చివరిలో విలన్‌గా మారిపోయి అసలు రూపం చూపిన్నట్లుగా, వైసీపి పాలనలో ఆయన చేసిన అకృత్యాలు, వేధింపులు, బెదిరింపులు, దోపిడీలు ఇప్పుడు ఒకటొకటిగా బయటపడుతున్నాయి.

నాలుగైదు రోజుల క్రితమే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ మీడియా ముందుకు వచ్చి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ధనుంజయ్ రెడ్డి తనను ఎంతగా వేధించారో, బెదిరించారో అన్నీ వివరించారు.

ఇంతకీ ఆయన చేసిన నేరం ఏమిటంటే, ఉద్యోగుల సమస్యల గురించి గవర్నర్‌ని కలిసి వినతిపత్రం ఇచ్చి జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరడం. అప్పుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను కలవడం.

తాజాగా నెల్లూరు జిల్లాలో సజ్జల మరో భాగోతం బయట పడింది. జిల్లాలోని సైదాపురం మండలంలోని జోగుపల్లిలో బద్రీనాధ్ అనే వ్యాపారస్తుడికి 240 ఎకరాల విస్తీర్ణంలో 8 క్వార్జ్ గనులున్నాయి. వేలకోట్లు విలువగల వాటిపై సజ్జల రామకృష్ణా రెడ్డి కళ్ళు పడ్డాయి.

తన అనుచరులు శ్రీ చరణ్, కృష్ణయ్యల ద్వారా తనను బెదిరించి గత రెండేళ్ళుగా యధేచ్చగా సుమారు 500-800 కోట్ల టన్నులను తవ్వేసి అమ్మేసుకున్నారని బధ్రీనాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణా రెడ్డిలదే పెత్తనం కావడంతో పోలీసులను ఆఃశ్రయించిన ఫలితం లేకపోగా, మళ్ళీ సజ్జల రామకృష్ణా రెడ్డి, ధనుంజయ్ రెడ్డి బెదిరించడంతో జరుగుతున్న దోపిడీని మౌనంగా చూస్తూ ఊరుకోవలసి వచ్చిందని అన్నారు.

నాడు ఏపీ సీఐడీ అధికారులు సైతం సజ్జల రామకృష్ణా రెడ్డి కనుసన్నలలో పనిచేయక తప్పేది కాదు. కానీ ఇప్పుడు అదే సీఐడీ అధికారులకు బధ్రీనాధ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది.

ఒంగోలు పట్టణంలో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్టాండ్ పక్కనే కోట్లు విలువచేసే సుమారు 1,800 గజాల స్థలాన్ని లీజుకి ఇచ్చేందుకు టెండర్లు పిలిస్తే, వైసీపి నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దానిలో పాల్గొన్న మిగిలిన ఇద్దరినీ బెదిరించి తప్పుకునేలా చేసి దానిని నామ మాత్రపు అద్దెకు దక్కించికున్నారని ఇప్పుడు పిర్యాదులు నమోదు అవుతున్నాయి.

జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాలో సుమారు 2 ఎకరాల చొప్పున మొత్తం 42 ఎకరాలు ఇదే పద్దతిలో వైసీపి కార్యాలయాల కోసం కేటాయించేసుకుని భవనాలు కూడా నిర్మించేసిన వార్తలు అందరూ చూసే ఉంటారు. రాబోయే రోజుల్లో ఇలాంటి భాగోతాలు ఇంకెన్ని చూడాలో?వైసీపిలో ఇంకెన్ని ఇలాంటి ఆణిముత్యాలున్నాయో?

ADVERTISEMENT
Latest Stories