‘బేరం’ తో రాయ’భారం’..ఫలిస్తుందా!

Sharmila-Jaganఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడ మల్లన్న అన్న సామెత అక్షరాల నిజమేనేమో అనిపిస్తుందట కొన్ని సందర్భాలు చూస్తుంటే. నిన్నటి మిత్రుడు నేటి శత్రువు, నేటి శత్రువు రేపటి మిత్రుడు అయినట్లు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ ఇంత వర్ణన ఎందుకు అని ఆలోచిస్తున్నారా. అయితే అసలు విషయం చూద్దాం పదండి.

రాజకీయాల్లో రక్త సంబంధాలు ఉండవు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూస్తే అర్ధం అవుతుందని పదేపదే టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు ఒకింత జనం చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. అయ్యో పాపం జగన్ ని ఎందుకు ఇలా ఆడిపోసుకుంటున్నారు, అసలు జగన్ అంటే వీరికి ఎందుకు ఇంత క్షక్ష అని అంటుంటారు.

ADVERTISEMENT

కానీ జగన్ కు అనుకూలంగా మాట్లాడినవారే అయ్యో రామా ఇదెక్కడి న్యాయం అంటూ జగన్ తీరుపై నెగిటివ్ గా మాట్లాడటం స్టార్ట్ చేశారట. కారణం ఏంటంటే జగన్ ఆయన సోదరి షర్మిళ పట్ల వ్యవహరించిన తీరే అని అంటున్నారు.

జగన్ జైల్లో ఉన్న సమయంలో జగన్ వదిలిన బాణంలా పాదయాత్ర తో షర్మిళ ప్రజల్లోకి దూసుకెళ్లారు. నిరుత్సాహం లో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఊపిరి నింపారు. వాస్తవానికి పార్టీకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉందంటే దానికి ముఖ్యకారణం షర్మిళ నే అనే మాటలు వైసీపీ పార్టీ నుండే కాక ప్రతిపక్షాలతో సహా సామాన్య ప్రజలు సైతం చెప్తున్న పరిస్థితి.

తీరా జగన్ అధికారంలోకి వచ్చాక.. సినిమాలో ముఖ్య పాత్ర ఇస్తారని అనుకుంటే ఆపాత్రని అర్ధాంతరంగా చంపేసి ఆ క్యారెక్టర్ రోల్ కి ముగింపు పలికినట్లు షర్మిళతో వ్యవహరించారు అనే విమర్శలు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు చేయడంతో పాటు, షర్మిళ కు మద్దత్తుగా మాట్లాడారు.

నాన్న కూచిగా వైఎస్ఆర్ లక్షణాలను పునికిపుచ్చుకున్న షర్మిళ పట్టుదల, పంతంలో తానేమీ తక్కువకాదు అని నిరూపించుకుంటున్నారనే టాక్ నడుస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చాక తనని రాజ్యసభకు పంపిస్తారని ఆశించారట. కానీ రాజ్యసభ ఊసు దేవుడెరుగు, ఆస్థిలో కూడా వాటా లేదు పొమ్మని తరిమేశారని షర్మిళ పరిస్థితి గురించి చాలా వార్తలు వచ్చాయి. వచ్చిన వార్తలు షర్మిళ ఖండించకపోవడం గమనార్హం.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జెరూసలేం పర్యటనకు వెళ్ళినప్పుడు ఆస్థి పంపకాల ప్రస్తావన జగనే తెచ్చినట్లు, ఆ మాటలు విన్న షర్మిళ ఆశ్చర్యపోయినట్లు, తీరా పంపకాలలో జరిగిన అన్యాయం చూసి షర్మిళ ఖంగుతున్నట్లు.. ఆపై హైదరాబాద్ కి పలాయనం చిత్తగించినట్లు చాలా విమర్శలు వచ్చాయి. పైగా ఆ విమర్శలే తాజాగా సీనియర్ జర్నలిస్ట్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ఆయన ఛానల్ లో ప్రసారమయ్యే “వీకెండ్ కామెంట్ బై ఆర్కే” కార్యక్రమంలో ప్రస్తావించారు కూడా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మరో అంశంగా జగన్ తీరుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న షర్మిళ భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఆంధ్రలో జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారట. అందులోనూ జగన్ తనకి స్థిరమైన ఓటు బ్యాంక్ అని నమ్మే క్రిస్టియన్ మైనారిటీల వద్ద బ్రదర్ అనిల్ ఈ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారట. దీంతో అసలే పార్టీలో కీలక నేతలు ఒక్కొక్కరుగా నిరసన గళం ఎత్తుతుంటే, మరో పక్క బ్రదర్ అనిల్ వ్యతిరేక ప్రచారం వైసీపీ కి తీవ్ర నష్టం చేకూరుస్తాయని భావించి జగన్ బుజ్జగింపు చర్యలు మొదలు పెట్టారట.

అందులో భాగంగానే జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి ని షర్మిళ తో రాయభారానికి పంపినట్లు తెలుస్తుంది. అయితే విజయమ్మ ద్వారా షర్మిళ ని ఒప్పించే ప్రయత్నం చేయాలని జగన్ సజ్జలకు సూచించినట్లు సమాచారం. కానీ విజయమ్మ మాత్రం షర్మిళ కి ఇవ్వాల్సినవి ఇస్తే అయిపోతుంది కదా అని అన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యమంత్రి అవ్వగానే జగన్ తీరుపై పూర్తి విశ్వాసం కోల్పోయిన షర్మిళ హామీలు ఇవ్వడం కాదు, ఆస్థులు సమానంగా పంచేస్తే అప్పుడు చూద్దాం అని అన్నారని తెలుస్తుంది. దీంతో చేసేది లేక షర్మిళ తో రాయభారానికి మరో ముఖ్యమైన వ్యక్తిని ప్రయోగించబోతున్నట్లు తెలుస్తుంది.

మరి ‘భారం’గా ఉన్న మనసుతో ఉన్న షర్మిళ రాయభారనికి ఒప్పుకుంటారా లేక “రాయ’భారం” గా ఫీల్ అవుతారా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిపోతుందనేది విశ్లేషకుల మాట.

ADVERTISEMENT
Latest Stories