27 లక్షల సమంత గిఫ్ట్ కు చైతూ 4.50 లక్షలు!

Samantha Gifts 27 Lakhs Bike To Naga Chaitanyaఈ నెల 29వ తేదీన జరగనున్న అక్కినేని నాగచైతన్య – సమంతల ఎంగేజ్మెంట్ పురస్కరించుకుని… తనకు కాబోయే శ్రీవారికి శ్యాం 27 లక్షల విలువైన బహుమతిని అందించింది. రేసింగ్ లంటే అమితంగా ఇష్టపడే చైతూకు 27 లక్షల విలువ గల ఇటాలియన్ మేడ్ ‘ఎంవి ఆగస్టా’ అనే ఓ స్పోర్ట్స్ బైక్ ను కానుకగా అందించింది. ఈ బైక్ లైఫ్ టైం రోడ్ టాక్స్ కోసమే చైతూ 4.50 లక్షల రూపాయలు ఖర్చు చేసాడు.

అయితే ఈ బైక్ ను రిజిస్ట్రేషన్ నిమిత్తం బుధవారం నాడు మాదాపూర్ ఆర్టీవో కార్యాలయానికి విచ్చేసిన చైతూ, ‘టిఎస్ 07 ఎఫ్ఎం 2003’గా రిజిస్ట్రేషన్ చేయించాడు. సెలబ్రిటీలందరూ ఫ్యాన్సీ నెంబర్ల వైపుకు పరుగులు పెడుతుంటే, నాగచైతన్య ఏమో ఎలాంటి విశిష్టత లేని నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం విశేషం. దీంతో 2003తో చైతూకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం ఉందో అంటూ ఆరా తీస్తున్నారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories