‘చైతూ – సమంత’ కాంభినేషన్ లో సెన్సేషనల్ మూవీ?

naga-chaitanya-samantha-selfie-at-engagement-of-akhil-shriya‘జనతా గ్యారేజ్’ తర్వాత ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమాను కూడా ఒప్పుకోని సమంత, మంచి పాత్రలు రావడం లేదంటూ సోషల్ మీడియాలో తన ఆవేదనను వెలిబుచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలుగులో ఓ మంచి సినిమా కోసం వేచిచూస్తున్న సమంతకు ఓ భారీ ఆఫర్ వరించిందని సినీ వర్గాల గుసగుసలు. ఇందులో మరో విశేషమేమిటంటే… తనకు కాబోయే శ్రీవారు నాగచైతన్య సరసనే సమంత నటించబోతుందట.

ADVERTISEMENT

ఏఎన్నార్, వాణిశ్రీల కాంభినేషన్ లో నాడు సురేష్ ప్రొడక్షన్స్ లో డి.రామానాయుడు నిర్మించిన ‘ప్రేమ్ నగర్’ సినిమా అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను బద్దలుకొట్టి సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇదే సినిమాను రీమేక్ చేయాలన్న ఆకాంక్షను సురేష్ బాబు తాజాగా వెలిబుచ్చారు. దీంతో చైతూ – సమంతల కాంభినేషన్ తో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోన్న లేటెస్ట్ టాక్.

‘ప్రేమ్ నగర్’ లేటెస్ట్ వర్షన్ లో నటించేందుకు చైతూ – సమంతల కన్నా బెస్ట్ జోడి మరొకటి ఉండదని, ఈ సినిమాతో సమంత చెలరేగడం ఖాయమన్న టాక్ సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరి ఈ రీమేక్ వార్తలు కార్యరూపం దాలిస్తే… అక్కినేని అభిమానులకు మరో పండగ లాంటి సినిమాను అందించినట్లే కదా! ‘మనం’ సినిమా నుండి టాలీవుడ్ లో అక్కినేని హీరోల హవా ఓ రేంజ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories