సమంత… చంపేసింది అంతే..!

Samantha Ruth Prabhu action in Raju Gari Gadhi 2ఇటీవల విడుదలైన అక్కినేని నాగార్జున “రాజు గారి గది 2” టీజర్ లో హైలైట్ సన్నివేశంగా సమంత పెయింటింగ్ సీన్ నిలిచిన విషయం తెలిసిందే. ఈ టీజర్ లో సమంత కనిపించకపోయినా, ఆమె బొమ్మను నాగ్ గీసిన సన్నివేశం “రాజు గారి గది 2”పై ప్రేక్షకులలో అత్యంత ఆసక్తిని పెంచడంలో సక్సెస్ సాధించింది. మరి పెయింటింగ్ లోనే అదరగొట్టిన సమంత సినిమాలో ఎలా చేసింది? అంటే ‘చంపేసింది’ అని చెప్తోంది చిన్మయి శ్రీపాద.

ADVERTISEMENT

అవును… ‘ఏ మాయ చేసావే’ సినిమా నుండి సమంతకు డబ్బింగ్ చెప్తోన్న చిన్మయి, “’రాజు గారి గది 2”సినిమాకు కూడా తన స్వరాన్ని అందించింది. మధ్యలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఒకటి, అర సినిమాలలో సొంత డబ్బింగ్ ఇచ్చుకున్న సమంతకు, మళ్ళీ చిన్మయితో పని వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ధృవీకరించిన చిన్మయి, డబ్బింగ్ చెప్తూ చివరికి ఏడ్చేసానని, సమంత చంపేసిందని నాగార్జున చేసిన ట్వీట్ కు రిప్లై ఇచ్చింది.

ADVERTISEMENT
Latest Stories