Samantha Viral

ఏం మాయచేసావో…సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసారు సమంత. ఇక్కడ ఇంతమంది నటీమణులు ఉంటే నువ్వే ఎందుకు ఇంతలా నచ్చావు ‘జేసి’ అంటూ కుర్రకారు మొత్తం సమంత జపం చేసారు.

Also Read – అమరావతి గురించి చింతించలేదు కాని ప్యాలస్‌ ముఖ్యమా?

తన మొదటి సినిమలో సినిమాలంటే తెలియని ఒక అమ్మాయిగా నటించిన సమంత కొన్ని సంవత్సరాల పాటు తెలుగు ఇండస్ట్రీలో అగ్ర స్థాయి కథానాయికగా తన హవా కొనసాగించారు. అయితే నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు వంటి వ్యక్తిగత కారణాలతో మానసికంగా దెబ్బతిన్న సమంత కు చర్మ సంబంధిత అనారోగ్యం రావడంతో కొద్దికాలం సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు.

అయితే సినిమాలకు దూరమైనా కూడా సోషల్ మీడియాలో తన అభిమానులకు ఎప్పుడు చేరువలోనే ఉంటారు సమంత. అయితే సమంత నుంచి మరో తాజా అప్ డేట్ వచ్చింది. తన స్నేహితులతో కలిసి చేసిన హెల్త్ పాడ్ కాస్ట్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నాను అంటూ తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ ద్వారా వెల్లడించారు. ఈ మధ్యకాలంలో పూర్తిగా పనిలేకుండా పోయిందని, అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారభించంటూ చెప్పుకొచ్చారు.

Also Read – చిరంజీవికి గంజి పెట్టి ఇస్త్రీ చేయక తప్పదట!

తానూ ఏడూ నెలల నుండి నిరుద్యోగిగా మారిపోయానంటూ, అందుకే మళ్ళీ బ్యాక్ టూ నార్మల్ లోకి వచ్చేస్తున్నా అంటూ కాసేపు సరదాగా ముచ్చటించారు. సమంత మాటలు చూస్తుంటే తన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడినట్లే కనపడుతుంది. మాయోసైటీస్ బారిన పడి కొన్ని నెలలుగా సమంత తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. దానితో ముందుగా ఒప్పుకున్న శాకుంతలం, ఖుషి సినిమాల తరువాత మరే ఇతర తెలుగు సినిమాలో కనిపించలేదు సమంత.




పూర్తిగా తన ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టి, అన్నిరకాలుగా పరిస్థితులు చక్కబడిన తరువాత సినిమాలు చేయాలనీ కాస్త బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలలో నటించడానికి రెడీ అంటూ ముందుకు రావడం తన అభిమానులకు మంచి విషయంగా చెప్పవచ్చు. ఊ…అంటావా మామ ఉఉ …అంటావా మామ అంటూ పుష్పాలో బన్నీతో కలిసి సమంత చేసిన స్పెషల్ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచి మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో అలరించిందనే చెప్పాలి.

Also Read – నాగార్జున కేసు మూడు రోజులలో… మరి జగన్‌ కేసులో?