తోటి వారికి సహాయం చేయడంలో సినీ నటుడు సంపూర్ణేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. అగ్రహీరోల మాదిరి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోకపోయినప్పటికీ… తనకున్న దాంట్లో పక్కనున్న వారికి సహాయం చేస్తుంటాడు. అలాంటి సంపూ తాజాగా మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లాలోని గాడిచెర్లపల్లిలో వినోద అనే మహిళ ఓ వింత వ్యాధితో బాధపడుతోంది.
ఆమె పరిస్థితిని తెలుసుకున్న సంపూ… ఆమెకు 10 వేల రూపాయల సహాయం చేశాడు. తాను చేసిన సహాయం పెద్దది కాదని… కానీ, ఆమెకు ఎంతో కొంత భరోసాను ఇస్తుందని ఈ సందర్భంగా సంపూ తెలిపాడు. ఆమె త్వరగా కోలుకోవాలని తానూ ఆకాంక్షిస్తున్నట్టు చెప్పాడు. ఇచ్చిన మొత్తం కంటే, సంపూ చూపించిన మానవత్వంకు ఫ్లాట్ అయిన నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



