ఏపీలో ప్రారంభమైన మరో సంక్షేమ పధకం!

Sand free of cost in andhra pradeshఉన్న బడ్జెట్ తోనే చిన్న చిన్న సంక్షేమ పధకాలను అమలు చేస్తున్న ఏపీ సర్కార్, శుక్రవారం నాడు మరో పధకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అనేక విమర్శలకు తావిచ్చిన ఇసుక రవాణాపై అంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇసుక మాఫియా’ అంటూ ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశానికి ప్రాధాన్యత లేకుండా ఇక నుండి ఇసుకను ఉచితంగా పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

ఇసుక వేలం ద్వారా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరుతున్నప్పటికీ, అంతకంటే ఎక్కువగా చెడ్డ పేరే వస్తోంది. ఈ నేపథ్యంలో ఇసుకపై ‘సెస్’ను వదులుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అంతేకాక ఇళ్ల నిర్మాణంలో కీలకమైన ఇసుకను పేదలకు ఉచితంగానే ఇవ్వడం ద్వారా సొంతింటి కలను మరింత సులువు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాత నిన్న ప్రకటించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories