సంక్రాంతి రేస్… రామ్ చరణ్ వర్సెస్ మోక్షజ్ఞ!

sankranthi-movie-releases-khaidi-no-150-vs-gautamiputra-satakarniఈ ఏడాది సంక్రాంతి పర్వదినాన కోట్లాడేందుకు కోడిపందాలను నిర్వహించడంపై హైకోర్ట్ ఆంక్షలు విధించడంతో అధికారికంగా అది సాధ్యమయ్యే విషయం కాదు. దీంతో సిల్వర్ స్క్రీన్ పైన పోటీపడే కోడి పుంజుల కోసమే అందరి ఎదురుచూస్తున్నారు. ‘చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ’గా సాగుతున్న ఈ పందెంలో లేటెస్ట్ గా ఓ ట్విస్ట్ వచ్చిపడింది. బహిర్గతంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వర్సెస్ ‘ఖైదీ నంబర్ 150’గా కనపడుతున్నా… అంతర్లీనంగా ‘రామ్ చరణ్’ వర్సెస్ ‘మోక్షజ్ఞ’గా మారబోతుందని లేటెస్ట్ ట్రేడ్ టాక్.

అవును… ‘ఖైదీ నంబర్ 150’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పాటలో కనిపించబోతున్నాడన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ తో కలిసి ఓ స్టెప్పులు వేయబోతున్న విషయం ఇప్పటికే అధికారికమైంది. అయితే అసలు ట్విస్ట్ మరో ఎండ్ నుండి లేటెస్ట్ గా వచ్చింది. బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న విషయం తెరపైకి వచ్చింది.

ADVERTISEMENT

గతంలో హల్చల్ చేసిన ఈ సమాచారంలో వాస్తవం ఉందని, బాలయ్య ప్రతిష్టాత్మక సినిమా అయినటువంటి ఈ సినిమాలో ఓ కీ రోల్ లో మోక్షజ్ఞ నటించారన్న టాక్ సినీ జనాల్లో వినపడుతోంది. అయితే అధికారికంగా ఎవరూ దీనిని ధృవీకరించలేదు. ఒక్కసారి ఈ వార్త అధికారికమైతే నందమూరి ఫ్యాన్స్ లో ఉత్తేజం మరింతగా రెట్టింపు అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. అప్పుడు బాలయ్య ‘వర్సెస్’ చిరు కాస్త… మోక్షజ్ఞ ‘వర్సెస్’ చెర్రీగా మారిపోతుందన్నది సినీ జనాలు చెప్తున్న మాట.

ADVERTISEMENT
Latest Stories