పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరు వరకు జరిగే షూటింగ్ తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవనుందని సమాచారం. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మించనున్న ఈ సినిమా విడుదల ముహూర్తం ఏప్రిల్ లో నిర్ణయించారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. “గబ్బర్ సింగ్” సినిమా మాదిరే పవన్ ఎర్ర కండువాతో దర్శనమిస్తుండగా, పవన్ పక్కనే అలీ, అలాగే అన్ని భాషలను కలిపి కొట్టిన పోలీస్ పాత్ర మరియు బ్యాక్ గ్రౌండ్ లో కనపడుతున్న సెట్స్ అన్నీ గత చిత్రాన్ని గుర్తుకు తెస్తున్నాయి.
దీంతో రజనీ “చంద్రముఖి” సినిమాకు సీక్వెల్ అని తెరకెక్కించిన “నాగవల్లి” సినిమా ఎలా అయ్యిందో, ఈ సినిమా కూడా అలాగే అయితే పవన్ అభిమానులు నిరుత్సాహానికి గురికాక తప్పదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా ఒక్క ‘పోస్టర్’తో సినిమా మొత్తాన్ని ముడిపెట్టడం సమంజసం కాదు కదా! కాసేపు సరదా కోసం నెటిజన్లు చేసే రోజువారీ కామెంట్లలో భాగమే అవి అనుకోవాలి. సినిమా వచ్చే వరకు ఇలాంటి పోస్టర్లు చూస్తూ ఎంజాయ్ చేయడమే పవన్ అభిమానుల వంతు!





