‘పవర్ స్టార్’ సినిమాకు హైకోర్టు బ్రేకులు!

Screening of Puneet rajkumar Anjaniputra stayedకన్నడ నాట ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్ కుమార్ చిత్రం ‘అంజనీపుత్ర’ ప్రదర్శన నిలిపివేయాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమాలో న్యాయవాదులను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ, సదరు సన్నివేశాలను తొలగించి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు.

ADVERTISEMENT

అలాగే సదరు అభ్యంతరకర సన్నివేశాలను తీసేసే వరకూ చిత్రంపై నిషేధాన్ని విధించాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన బెంగళూరు సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి, జనవరి 2 వరకూ సినిమా ప్రదర్శన నిలిపేయాలని, ఈ లోపుగా లాయర్లను, న్యాయ వ్యవస్థను కించపరిచే డైలాగులను తొలగించాలని పేర్కొంది. దీంతో పవర్ స్టార్ సినిమాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.

ADVERTISEMENT
Latest Stories