ట్రైలర్ టాక్ : ఫస్టాఫ్ ఖాళీ! సెకండాఫ్ బిజీ!

Seethamma Andalu Ramayya Sitralu Theatrical Traileవరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న హీరో రాజ్ తరుణ్ నటించిన నాలుగవ సినిమా “సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు” ఆడియో విడుదలైంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాకు శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ రాజ్ తరుణ్ మొదటి సినిమా ‘ఊయ్యాల… జంపాల…’ను గుర్తు చేస్తోంది.

ADVERTISEMENT

సీతను రాము ఎలా దక్కించుకుంటాడనేది క్లుప్తంగా ఈ సినిమా కధ. సీతగా నటించిన ఆర్తన సినిమాకు ఫ్రెష్ లుక్ తీసుకురాగా, రాజ్ తరుణ్ నటనలో ఎలాంటి మార్పు లేదు. పల్లెటూరు వాతావరణంలో చిన్నప్పటి నుండి సాగే ప్రేమ కధలో ఉండే ట్విస్టులు, కధనం రాజ్ తరుణ్ మొదటి సినిమాను జ్ఞప్తికి తెస్తున్నాయి. అలాగే ఈ ట్రైలర్ లో రాజ్ తరుణ్ చెప్పిన డైలాగ్… “ఫస్టాఫ్ ఖాళీ, సెకండాఫ్ బిజీ” హీరో పాత్రను నిర్వచించే విధంగా ఉంది. యాజిటిజ్ గా “ఊయ్యాల జంపాల”ను పోలివున్న “సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు” ధియేటిరికల్ ట్రైలర్…

ADVERTISEMENT
Latest Stories