ఫస్ట్ లుక్ లో పడేసాడు!

Shabdham First Look Posterఅప్పుడెప్పుడో పూర్తి మూగ పాత్రలో చంద్రమోహన్ కనిపించగా, మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత నారా రోహిత్ “శబ్దం” సినిమాలో ఆ తరహా పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఆ మూగతనమే అతని ఆయుధం అంటూ ఫస్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. “శబ్దం” టైటిల్ లోగోతో విడుదలైన ఈ ఫస్ట్ పోస్టర్ నెటిజన్లను ఫిదా చేసింది. ‘హిజ్ వెపన్ ఈజ్ హిజ్ సైలెన్స్’ అన్న ట్యాగ్ లైన్ తో సినిమాపై ఆసక్తిని పెంచారు.

ADVERTISEMENT

వినూత్నమైన కధలను ఎంపిక చేసుకునే నారా రోహిత్, ఈ సినిమాతో తన అభిరుచి ఏమిటో మరోసారి చాటిచెప్పాడు. షూటింగ్ మొదలైన రోజునే టైటిల్ లోగోతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేసారంటే చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్ లో ఉన్నట్లుగా కనపడుతోంది. మంజునాథ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ప్రారంభమైన ఈ సినిమాకు వికాస్ కురిమేళ్ళ సంగీతం అందిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories