బాబోయ్… ఈ హీరో హెయిర్ స్టైల్ ఏంటో..!

srk-hair-styleతాము ఎంతగానో అభిమానించే సినిమా హీరోలను ఒకే విధంగా చూస్తే బోర్ కొట్టేయడం చాలా సహజమైన విషయం. అందుకే, ప్రతి సెలబ్రిటీ కూడా ఎప్పుడూ తనను తానూ కొత్తగా ఆవిష్కరించుకుంటారు. ఆ క్రమంలోనే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఓ కొత్త హెయిర్ స్టైల్ తో అభిమానుల ముందుకు వచ్చేసాడు. అయితే ఇదేమి సీరియస్ లుక్ కాదనుకోండి..!

తన బెడ్ పైన ఉన్న పిల్లోలు కూడా తన హెయిర్ కు కొత్త డిజైన్లు చేస్తాయంటూ పెట్టిన ఫోటోకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. చింపిరి చింపిరి జుట్టుతో ఓ దెయ్యం మాదిరి ఉన్న ఈ లుక్ ను చూసి… ‘బాబోయ్… ఇదేమి హెయిర్ స్టైల్…’ అన్నా గానీ, వీక్షకులకు కొత్తదనాన్ని పంచుతోంది. అంతేకదా… సెలబ్రిటీలు ఏం చేసినా ఫ్యాన్స్ కు పండగే కదా..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories