భావప్రకటన స్వేచ్ఛ పేరుతో వైసీపీ సోషల్ మీడియా హద్దులు దాతుంటుందని సమాజం ముందు నిరూపితమయినప్పటికీ వైస్ జగన్ ఇంకా అటువంటి వారికి మద్దతుగా మీడియా సమావేశం పెట్టి మరి కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు.
అయితే ఈ విష సంస్కృతీని ఇక్కడితో కట్టడి చెయ్యాలనే దృఢ సంకల్పంతో ఏపీ ప్రభుత్వం మహిళలను అవమానించేలా, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవరైనా పోస్టులు పెడితే వారి పై ఉక్కుపాదం మోపడానికి వెనుకాడదు అన్నట్టుగా ఒక్కో వైసీపీ సోషల్ మీడియా సైకో మీద కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు.
Also Read – బీసీల పరిస్థితి మారలేదు కానీ.. కృష్ణయ్యది మారిందిగా!
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు, ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తూ పోస్ట్ లు షేర్ చేసినందుకు గాను కూటమి ప్రభుత్వం కక్ష్య పూరితంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టీవిస్టుల మీద అన్యాయంగా కేసులు మోపుతుందని, దీనికి పోలీస్ వ్యవస్థ సహకరిస్తుందంటూ సుద్దపూస కబుర్లు వల్లెవేశారు జగన్.
గత ఐదేళ్లుగా వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వెయ్యలేరా అంటూ ఇటు సాధారణ ప్రజలు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే జగన్ మాత్రం వారంతా అమాయకులు, ఏమి తెలియని పత్తిత్తులు అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read – పుష్ప-2: కచ్చితంగా పునః సమీక్ష అవసరం!
అయితే ఒక పక్క అన్న జగన్ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇది కక్ష్య పూరిత పాలన, దీనికి ఇక్కడితో ఎండ్ కార్డు వేయంటూ అంటూ హెచ్చరికలు పంపుతుంటే మరోపక్క చెల్లి షర్మిల మాత్రం కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు, ఇది ప్రజా అభిలాష అంటూ తన సోషల్ మీడియాలో స్పందించారు.
సోషల్ మీడియా ను అడ్డుపెట్టుకుని కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా మానవ సంబంధాలను భ్రష్టు పట్టిస్తూ సమాజానికి చీడపురుగులు మాదిరి తయారయ్యారు. తమ ఇంట్లో కూడా తల్లి, చెల్లి, అక్కా, భార్య ఇలా మహిళలు ఉంటారనే కనీస సంస్కారం కూడా లేకుండా సాటి మహిళల పట్ల అసభ్యకర పోస్ట్ లు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు ఈ సోషల్ మీడియా సైకోలు అంటూ తీవ్ర గళంతో పరోక్షంగా వైసీపీ పార్టీకి కౌంటర్ వేశారు షర్మిల.
Also Read – వర్మ సినిమాలకు జగన్ పెట్టుబడి: క్విడ్ ప్రోయే కదా?
ఇటువంటి సైకోల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటూ గట్టి చర్యలు తీసుకోవాలని, ఈ ప్రభుత్వ నిర్ణయానికి తన మద్దతు తెలియచేసారు. అలాగే తన పుట్టుకను అనుమానించి, తన ఇంటి పేరును మార్చి శునకానందం పొందిన వర్ర రవీంద్ర రెడ్డి వంటి సైకో అరెస్టు నేను కూడా స్వాగతిస్తున్నా అంటూ ప్రభుత్వానికి బేషరతు మద్దతు పలికారు షర్మిల.
ఒక్క షర్మిల మాత్రమే కాదు మనసు, మానవత్వం, కుటుంబ బంధాలు, రాజకీయ విలువలు, మహిళల పట్ల గౌరవ భావం ఉన్న ప్రతి ఒక్కరు ఇటువంటి సైకోల అరెస్టులను తప్పక స్వాగతిస్తారు. ఇది కూటమి ప్రభుత్వానికే కాదు ఏపీ భవిష్యతు కు అత్యవసరం.