టీజర్ టాక్ – మరో ‘గబ్బర్ సింగ్’ పోలీస్ లా ఉన్నాడే!

Sharwanand Radha Teaser Talkవిలక్షణ సినిమాలతో వరుస సక్సెస్ లను చవిచూస్తున్న హీరోలలో శర్వానంద్ ఒకరు. ఇప్పటికే ఈ ఏడాది “శతమానం భవతి” ద్వారా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను చవిచూసిన శర్వానంద్, మరో కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో’ సినిమాల బ్యానర్ శ్రీవెంకటేశ్వర సినీ చరిత్రపై బోగవల్లి బాపినీడు నిర్మిస్తున్న “రాధ” తొలి టీజర్ ప్రేక్షకులను పలకరించింది.

పోలీస్ గెటప్ లో ఉన్న శర్వానంద్ అభినయాన్ని విమర్శించలేం గానీ, ఈ టీజర్ చూడగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమా గుర్తుకు రావడం సహజం. అదే రకపు గెటప్, రౌడీల సెటప్, డ్యాన్స్ లు, లొకేషన్స్, చివరి పంచ్ డైలాగ్… ఇలా అన్నీ కూడా ‘గబ్బర్ సింగ్’ను తలపించే విధంగా ఉండడం కొసమెరుపు. శర్వానంద్, లావణ్య త్రిపాఠిల జంట ఫ్రెష్ గా కనపడుతున్నా, టీజర్ మాత్రం పవన్ సినిమానే మరపిస్తోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories