షాకింగ్ ట్విస్ట్ – పెద్ద నోట్ల “విలువ”లో మార్పు?

shocking-big-notes-value-changedపెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించే సమయానికి దేశంలో 15.44 లక్షల కోట్లు ఉన్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐ అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటికే ఇందులో 90 శాతంకు పైగా మొత్తం బ్యాంకులకు చేరుకోవడంతో ‘నోట్ల రద్దు ఐడియా’ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్న టాక్ ను మూటకట్టుకున్నారు. ఇంకా సమయం మిగిలి ఉండడంతో, ఆ మిగిలిన 10 శాతం కరెన్సీ కూడా బ్యాంకులకు చేరుకుంటుందని, అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం దేశంలో అసలు ‘బ్లాక్ మనీ’ లేదని ఖరారైందని ప్రతిపక్షాలతో సహా ఆర్ధిక నిపుణులు మండిపడుతున్నారు.

అయితే తాజాగా ఆర్బీఐ చేసిన ప్రకటన ప్రకారం పాత 500, 1000 నోట్ల విలువ దాదాపుగా 20 లక్షల కోట్లుగా ఉందట. ఈ మొత్తంలో 1000 రూపాయల నోట్ల కాగితాల విలువ 9.13 లక్షల కోట్లని, 500 నోట్ల విలువ 11.38 కోట్లని, ఈ మొత్తంలో ఆర్బీఐ 2000 వేల రూపాయలను 4.94 లక్షల కోట్లే ముద్రించిందని ఆర్బీఐ తెలిపింది. సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని ముంబైకి చెందిన అనిల్ గాల్గాలి ద్వారా బయటకు వచ్చిన ఈ సమాచారం అందరినీ అవాక్కు చేస్తోంది.

ADVERTISEMENT

అప్పట్లో 15.44 లక్షల కోట్లని స్వయంగా ఆర్బీఐనే ప్రకటన చేయగా, తాజాగా అదే ఆర్బీఐ ఆ సంఖ్యను 20 లక్షల కోట్లకు పెంచడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ ప్రకటనలో ఏమైనా మతలబు ఉందా? 20 లక్షల కోట్లల్లో బ్యాంకుల వద్ద ఉన్న సీఆర్ఆర్ కూడా కలిపి ఉందా? అంటే 15.44 కేవలం మార్కెట్ లో ఉన్నవేనా? ఇలా అనేకానేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి దీనికి బదులిచ్చేది ఎవరు… చెప్మా..!

ADVERTISEMENT
Latest Stories