శ్రేయా భూపాల్… అక్కినేని అఖిల్ కు కాబోయే శ్రీమతిగా ఈ పేరు తెలుగు ప్రజలకు సుపరిచితం అయ్యింది. అయితే అంతలోనే ఆ లవ్ స్టోరీకి బ్రేకప్ పడడంతో, శ్రేయా భూపాల్ పేరు మరింతగా మీడియా వర్గాల్లో హల్చల్ చేసింది. అక్కినేని ఇంట రెండో కోడలుగా అడుగు పెట్టే అవకాశాన్ని చేజార్చుకున్న తర్వాత తెరమరుగైన శ్రేయా భూపాల్ పేరు తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది.
అయితే ఈ సారి కూడా పెళ్లి వార్తలతోనే కావడం విశేషం. ప్రముఖ జీవీకే కుటుంబ వ్యక్తి అయిన శ్రేయా భూపాల్, త్వరలో రామ్ చరణ్ సతీమణి అయిన ఉపాసన కజిన్ ను వివాహం చేసుకోబోతోందనే వార్తలతో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఉపాసన కజిన్ అనందిత్ తో శ్రియా వివాహం నిశ్చయమైందని, ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



