“భరత్ అనే నేను” కోసం మరోసారి ఆలోచించాలి!

Shruti Haasan in Mahesh Babu Koratala siva Movieప్రస్తుతం సెట్స్ పైనున్న మురుగదాస్ సినిమా జూన్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ “భరత్ అనే నేను” సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి సమయానికి విడుదల టార్గెట్ గా పెట్టుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మరోసారి శృతిహాసన్ కు అవకాశం కల్పించబోతున్నట్లుగా ఇటీవల వార్తలు హల్చల్ చేసాయి.

ADVERTISEMENT

‘శ్రీమంతుడు’ సినిమాలో జంటగా కనిపించిన మహేష్ – శృతిహాసన్ ల జోడి సినిమాకు ఫ్రెష్ లుక్ ను తీసుకురావడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ఈ హిట్ పెయిర్ ను ‘భరత్ అనే నేను’ సినిమాలో కూడా రిపీట్ చేయాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాలలో ప్రచారం జరిగింది. కానీ, తాజాగా విడుదలైన ‘కాటమరాయుడు’లో శృతి లుక్ పట్ల అంతా పెదవి విరుస్తున్న నేపధ్యంలో, ప్రిన్స్ పక్కన శృతి విషయం హాట్ టాపిక్ గా మారింది.

వెండితెరపై గ్లామరస్ గా కనిపించడంలోనే కాదు, శృతి ముఖకవళికల్లో మునుపటి ‘గ్లౌ’ కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే ‘కాటమరాయుడు’లో శృతిహాసన్ కంటే పవన్ చాలా అందంగా కనిపించారు. మరి అలాంటి శృతిని మహేష్ పక్కన ఎంపిక చేయడమనేది సాహాసంతో కూడుకున్న నిర్ణయమనే చెప్పాలి. మరి దీనిపై దర్శకుడు కొరటాల శివ మరోసారి పునరాలోచిస్తారా? లేదా? అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న శృతిహాసన్ తో ‘శ్రీమంతుడు’ జంటను వీక్షించడం మాత్రం కష్టసాధ్యమేనని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT
Latest Stories