ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బాలీవుడ్‌ను కూడా తాకిందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ తనకు చేసిన పరీక్షలలో కరోనా వైరస్ కు పాజిటివ్ గా తేలింది. ఆమె గత ఆదివారం యుకె నుండి తిరిగి వచ్చింది, కాని విమానాశ్రయం బాత్రూంలో దాకుని అధికారుల నుండి తప్పించుకుని వెళ్లిపోయిందట.
ప్రభుత్వం విదేశాల నుండి వస్తున్న ప్రయాణికులను తప్పని సరిగా రెండు వారాల పాటు వేరుగా ఉంచడంతో ఆమె ఇలా చేసినట్టు సమాచారం. దీనితో ఆమె తన ట్రావెల్ హిస్టరీని అధికారుల నుండి దాచిపెట్టింది. ఆమె తిరిగి వచ్చిన తరువాత ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉండి లక్నోలో 100+ మందితో ఒక పార్టీకి హాజరయ్యారు.
ఈ బాధ్యతా రహితమైన ప్రవర్తన గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఆమెను పరిశ్రమ నుండి బహిష్కరించాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమెను లక్నో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కెజిఎంయు) ఆసుపత్రిలో చేర్చారు.ఆమె కలిసిన వారిని గుర్తించి వారికి కూడా టెస్టులు చేసే పనిలో పడింది స్థానిక అధికారులు.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 206 కి చేరుకుంది. జైపూర్‌లో 69 ఏళ్ల ఇటాలియన్ పర్యాటకుడు కన్నుమూసిన తరువాత దేశంలో కరోనా సంబంధిత మరణాలు ఐదుకు చేరుకున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే… తెలంగాణాలో పదహారు, ఆంధ్రప్రదేశ్ లో మూడు కేసులు నమోదు అయ్యాయి.



