ఏపీలో సాగుతున్న లిక్కర్ కేసు వైసీపీ నాయకుల అధికార మత్తు వదిలిస్తుంది, అలాగే ఈ కేసు తాలూకా జరుగుతున్న వైసీపీ నేత అరెస్టులు అధికార పార్టీ శ్రేణులకు కిక్కునిస్తుంది.
అయితే ఈ కేసులో ఇప్పటికే అనేకమంది వైసీపీ నాయకులు, జగన్ సన్నిహితులు అరెస్టవ్వగా అందులో కొంతమంది బెయిలు మీద బయటకొచ్చారు.ఇందులో ఈ మధ్యనే ఏసీబీ కోర్ట్ నుండి బైలు మీద బయటకొచ్చిన రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సైతం ఉన్నారు.
ఐక్యరాజ సమితి సమావేశాలలో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మిథున్ రెడ్డి కి అనుకోని షాక్ అనేలా నేడు సిట్ అధికారులు మిథున్ రెడ్డి ఇళ్ల పై, కార్యాలయాలపై దాడులు చేసారు.
జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ మరియు యూసఫ్ గూడలోని గాయత్రీ హిల్స్ లో, అలాగే హైద్రాబాద్ లోని కొండాపూర్ కార్యాలయంలోను, బెంగళూర్ నివాసాలలోను సిట్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అయితే లిక్కర్ కేసులో ఇదొక కీలక పరిణామంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
అయితే ఈ చర్యలను కూటమి ప్రభుత్వ కక్ష్య రాజకీయాలలో భాగమే అంటూ వైసీపీ ప్రజల అటెన్షన్ ను దారి మళ్లించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ స్కాం లో దాదాపు 3200 కోట్ల అవినీతి జరిగిందనేది అధికారుల వాదన. ఈ అవినీతిలో మిథున్ రెడ్డి పాత్ర కూడా చాల కీలకం అంటూన్నారు.
మరి సిట్ జరిపిన ఈ ఏకకాల దాడులతో మిథున్ రెడ్డి మరోసారి అధికారుల ముందు లాక్ అవుతారా.? లేక ఇచ్చిన షరతులతో కూడిన బెయిలు పై బయటుంటారా.? లేక న్యాయస్థానం అనుమతితో ఐక్యరాజ్య సమితి సమావేశాల కోసం న్యూయార్క్ వెళతారా.?







