బడ్జెట్‌ ముఖ్యం కాదు.. ప్రేక్షకులను మెప్పిస్తే చాలు!

Small Telugu films succeeding against big-budget movies

మొన్న రాజు వెడ్స్ రాంబాయి, నేడు ఆంద్ర కింగ్ తాలూకా… రేపు మరో చిన్న సినిమా హిట్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే, ప్రేక్షకులను మెప్పించే కధ, కధనంతో తీయడం వల్లనే. ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ఛార్జీలు పెంచరు. అయినా కలెక్షన్స్ కనక వర్షం కురిపిస్తారు ప్రేక్షకులు. కనుక సినిమా బాగుండటం, టికెట్ రేట్ అందుబాటులో ఉండటం రెండూ ముఖ్యమే అని స్పష్టమవుతోంది.

కానీ భారీ బడ్జెట్‌తో పెద్ద హీరోలతో మాత్రమే సినిమాలు తీసే దర్శక నిర్మాతలు అదే మూసధోరణిలో సాగిపోతున్నారు. సినిమా ఆడకపోతే ఆర్ధికంగా నష్టపోవడమే కాదు… ఫ్లాప్ సినిమా సూపర్ హిట్ అయ్యిందని గొప్పలు చెప్పుకుంటూ నవ్వుల పాలవుతున్నారు కూడా.

ADVERTISEMENT

అయితే పిండి కొద్దీ రొట్టె అన్నట్లు అద్భుతమైన సినిమాలు తీయాలంటే భారీ బడ్జెట్‌ తప్పదు. అది తప్పు కాదు. కానీ భారీగా బడ్జెట్‌ పెట్టగల శక్తి ఉంది కనుక దానికి తగ్గట్లుగా సినిమాలు తీయాలనుకోవడమే తప్పు. అలాంటి సినిమాలే బోర్లా పడుతుంటాయి. ఉదాహరణకు రామ్ చరణ్‌తో రంగస్థలం, గేమ్‌ చేంజర్‌ చేశారు. ఒకటి ఆడింది మరొకటి బోర్లా పడింది. అలాగే ప్రభాస్‌తో రాధేశ్యాం, ఆదిపురుష్, కల్కి తీశారు. రెండు పోయాయి ఒకటి ఆడింది. కనుక సినిమాకు బడ్జెట్‌ ముఖ్యమే కానీ కధ అంతకంటే ముఖ్యం.

పెద్ద సినిమాల ధాటిని చిన్న సినిమాలు తట్టుకోవడం చాలా కష్టం. కానీ సినిమా బాగుంటే పెద్ద సినిమాలతో పోటీ పడగలవని బలగం, హనుమాన్ వంటి సినిమాలు నిరూపించి చూపాయి కదా? కనుక పెద్ద నిర్మాతలు, స్టార్ దర్శకులు, పెద్ద హీరోలు చిన్న సినిమాలను మెచ్చుకుంటే సరిపోదు. వారి సినిమాలు థియేటర్లలో ఆడేందుకు సహకరించడం కూడా చాలా అవసరం. పెద్ద సినిమాలు ఊహాతీతమైన లోకాన్ని చూపిస్తే, చిన్న సినిమాలు మన సమాజం, సంప్రదాయాలు, మన ఊర్లు, మనుషులు, మన బాష, మట్టి వాసనని చూపిస్తాయి.

ADVERTISEMENT
Latest Stories