‘స్మార్ట్ టీవీ’లు ఉన్నాయా… అయితే ఇది మీ కోసమే..!

smart-tv-virus-repairs-costఇంటర్నెట్ అనుసంధానంతో టీవీలోనే అన్ని రకాల యాప్ లతో పాటు పలు సర్వీసులు వినియోగించే వీలు కలిగిన స్మార్ట్ టీవీల వినియోగదారులకు ఆందోళ‌న క‌లిగించే విష‌యం ఒక‌టి వెలుగులోకి వచ్చింది. ఇంత‌వ‌ర‌కు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ‘వైరస్’ సోకుతుండ‌డం చూశాం. ఇప్పుడు ‘స్మార్ట్ టీవీ’లకు కూడా వైరస్ వ్యాప్తి చెందినట్లు స్ప‌ష్ట‌మైంది.

యూరప్ లోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం త‌మ ఇంట్లో ఉన్న ఎల్‌జీ స్మార్ట్ టీవీలో ఓ సినిమాను చూసేందుకు ఓ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. అనంత‌రం అత‌డి కుటుంబ సభ్యులు ఆ టీవీలో మూవీ చూస్తుండగా మధ్యలో ఆగిపోయింది. అనంత‌రం స్క్రీన్ పై వైరస్ సోకినట్లు చూపుతున్న ఓ ఇమేజ్ వ‌చ్చింది. దీంతో సదరు ఇంజనీరు ఆ టీవీని మ‌ళ్లీ సెట్ చేయడానికి ప్ర‌యత్నించినప్పటికీ, మ‌ళ్లీ టీవీ ఆన్ కాలేదు. దీంతో త‌మ ఇంటికి వ‌చ్చి టీవీని బాగుచేయాల్సిందిగా టెక్నీషియన్‌కు చెప్పాడు.

ADVERTISEMENT

దీంతో వారి ఇంటికి వ‌చ్చి టెక్నీషియ‌న్ ఆ టీవీని రీసెట్ చేయడానికి 23,170 రూపాయలు (ఇండియన్ కరెన్సీ ప్రకారం) ఖర్చ‌వుతుంద‌ని చెప్పాడు. అంతేగాక‌, టీవీలో సోకిన వైరస్ ను తొలగించడానికి మ‌రో 11 వేలు ఖర్చవుతుందని చెప్పడంతో అవాక్కవ్వడం ఆ కుటుంబం వంతయ్యింది. స‌దరు ఇంజ‌నీరు త‌మ ఇంట్లోని ఆ స్మార్ట్ టీవీలో యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్లే స్టోర్ నే ఉప‌యోగించాడా? లేదా వేరే సైట్లను ఉప‌యోగించాడా? అనే విష‌యం గురించి స‌మాచారం లేదు.

ADVERTISEMENT
Latest Stories