తాట తీస్తా… చిటికేస్తే వెయ్యి తునకలవుతావ్…. కట్ చేస్తే దేశానికే ఆదర్శం!

Pawan Kalyan - KCRరాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరంటారు. గతంలో ఎన్నోసార్లు ఇది నిరూపించబడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. నిన్న పవన్ కళ్యాణ్ కేసీఆర్ ను కలవడం సంచలనం సృష్టించింది. జగన్ అభిమానులు గతంలో పవన్ కళ్యాణ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలిపి ఒక వీడియో చేసారు.

ADVERTISEMENT

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అనేదానికి తార్కాణం ఆ వీడియో. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతుంది. గతంలో వరంగల్ ఎన్నికల సభలో కాబోయ్ మొదటి బీసీ ప్రధానమంత్రిని ఎమన్నా అంటే కేసీఆర్ నీ తాట తీస్తా అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

దానికి ప్రతిగా కేసీఆర్ వాడెవడో వరంగల్ లో తెలంగాణాలో కూర్చుని నా తాట తీస్తాడంట చిటికేస్తే వెయ్యి తునకలవుతావ్ అని ఆయన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు. అయితే అదంతా ఇప్పుడు గతం. ఇటీవలే రాజభవన్ లో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు చాలా సేపు ముచ్చటించుకోవడం చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రగతి భవన్ కు వెళ్ళి దేశానికే ఆదర్శం తెలంగాణా ప్రభుత్వం అని చెప్పొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories