ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని, అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అది సాధ్యమయ్యే అవకాశమేలేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటించారు. ” అవినీతిపరుడు కాబట్టే కేంద్రం అతన్ని నమ్మట్లేదు..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధమే కానీ ఆ నిధులను చంద్రబాబు దొబ్బితింటాడు,” అని సోము వీర్రాజు అన్నారు.
అరుణ్ జైట్లీ సూచించినట్లు ‘స్పెషల్ స్టేటస్ వెహికల్’ ఏర్పాటు చేస్తే.. హోదా హామీ ద్వారా ఏపీకి దక్కాల్సిన అన్నిటికి అన్ని మేళ్లూ అందుతాయని, ఈ విషయంలో బీజేపీపై ఎలాంటి అనుమానాలు అవసరంలేదని వీర్రాజు స్పష్టం చేశారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు మాత్రం అందుకు సుముఖంగా లేరని, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆయన రాష్ట్రాన్ని బలిపెడుతున్నాడని పేర్కొన్నారు.
పోలవరం నుండి స్కూళ్లలో ఆడపిల్లల కోసం కట్టిన టాయిలెట్ల నిర్వహణలోనూ చంద్రబాబు అండ్ కో నిధులు నాకేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. కాబట్టి చంద్రబాబు దిగిపోయాక స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ అంటుంది అని అనుకోవాలా? చంద్రబాబు అవినీతి పరుడైతే కేంద్రం ఆయన మీద చర్యలు తీసుకోవాలి గానీ రాష్ట్రానికి న్యాయం గా ఇవ్వాల్సినవి ఇవ్వము అంటే కుదురుతుందా?



