‘సోనీ’ పెట్టిన ‘సున్నా’కు లొంగిపోయాడా?

Sony Offers $150 Million Daniel Craig, Sony Offers $150 Million Daniel Craig James Bond, Sony Company Offers $150 Million Daniel Craig James Bond 007అవును… మాజీ జేమ్స్ బాండ్ ‘సున్నా’కు లొంగిపోయాడు. సోనీ సంస్థ 100 పక్కన పెట్టిన ఓ ‘సున్నా’కు డానియల్ క్రేగ్ పడిపోయాడు. ఈ కధాకమామీషులోకి వెళితే… ఇక భవిష్యత్తులో జేమ్స్ బాండ్ పాత్రను వేయబోనని డానియల్ క్రేగ్ భీష్మించుకుని కూర్చున్న వేళ, ఇప్పటికిప్పుడు మరో హీరోను వెతికే ఆలోచనలో లేని నిర్మాణ సంస్థ సోనీ, భారీ ఆఫర్ ను క్రేగ్ ముందుంచినట్టు తెలుస్తోంది.

ఎంత అంటే… ఏకంగా 150 మిలియన్ డాలర్లు (దాదాపు 1000 కోట్లు) ఇచ్చేందుకు సోనీ నుంచి క్రేగ్ కు ఆఫర్ వెళ్లినట్టు ‘రాడర్ ఆన్ లైన్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కనీసం మరో రెండు సినిమాల వరకూ డానియల్ నే హీరోగా కొనసాగించాలని నిర్మాతలు భావిస్తుండగా, ‘స్పెక్టర్’ చిత్రం తరువాత, తానింక బాండ్ సినిమాలు చేయబోనని హీరో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

బాండ్ చేసే స్టంట్స్ కారణంగా తాను గాయాలపాలౌతూ ఇబ్బందులు పడుతున్నట్టు గతంలో క్రేగ్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే సోనీ సంస్థ ఇచ్చిన ఈ ఆఫర్ కు డానియల్ క్రేగ్ నుండి ఇంకా సమ్మతం రానప్పటికీ, దాదాపుగా ఈ డీల్ కుదిరినట్లుగానే మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో మరోసారి జేమ్స్ బాండ్ 007గా డానియల్ క్రేగ్ దర్శనమిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories