‘బ్రిట్నీ స్పియర్’ను చంపేసిన ‘సోనీ మ్యూజిక్’

sony-music-tweet-britney-spear-deadప్రముఖ సంగీత సంస్థ సోనీ ఘోరతప్పిదం చేసింది. ప్రముఖ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ మృతి చెందిందని ట్వీట్ చేసింది. బ్రిట్నీ స్పియర్స్ ఒక ప్రమాదంలో మృతి చెందినట్టు పుకార్లు వెల్లువెత్తడంతో స్పందించిన సోనీ మ్యూజిక్ ఆమె మృతి చెందిందని, మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

సీఎన్ఎన్ ఛానెల్ నేరుగా బ్రిట్నీ స్పియర్స్ ను సంప్రదించి, ఆమె మృతి చెందలేదని, బ్రతికే క్షేమంగా ఉన్నారని తెలుపుతూ కథనం ప్రచురించింది. దీంతో ఆమె అభిమానులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే నిపుణులు సోనీ మ్యూజిక్ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైనట్టు అనుమానిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సుందర్ పిచాయ్, మార్క్ జుకెర్ బర్గ్ వంటి వారి ఖాతాలు హ్యాకింగ్ కు గురైన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

ఫేమ్ సంపాదించుకునేందుకు ఆదరణ ఉన్నవారి అకౌంట్లు హ్యాక్ చేయడం దగ్గర దారిగా హ్యాకర్లు భావిస్తుండడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుండడం విశేషం. ‘బేబీ వన్ మోర్ టైమ్’ పాటతో కెరటంలా వచ్చిన బ్రిట్నీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున అభిమాన గణాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. మన టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూడా బ్రిట్నీ స్పియర్ అభిమానుల్లో ఒకరు.

ADVERTISEMENT
Latest Stories