టీజర్ టాక్ : ‘ఓవర్’ స్పీడు ప్రమాదం!

Speedunnodu Movie Teaser ‘అల్లుడు శీను’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ తన రెండవ చిత్రం “స్పీడున్నోడు” ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ సాయి పుట్టినరోజు సందర్భంగా విడుదలై యూ ట్యూబ్ లో సందడి చేస్తోంది.

“స్పీడున్నోడు” సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘స్పీడు’ చూసి సినీ జనాలు అవాక్కవుతున్నారు. ‘అల్లుడు శీను’ స్పీడు కాస్త ‘ఓవర్’ అయ్యిందేమో అంటూ కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఫైటింగ్ సన్నివేశాలు చూసిన సినీ జనం అగ్ర హీరోల సినిమాలలో కూడా మరి ఇంత ఓవర్ గా ఫైట్లు ఉండవేమోనని… ‘ఓవర్ స్పీడ్ ప్రమాదకరం, జరభద్రం’అంటూ సూచనలిస్తున్నారు నెటిజన్లు. సాధారణంగా తమిళ హీరో విశాల్ సినిమాలలో ఇలాంటి పోరాట సన్నివేశాలు దర్శనమిస్తుంటాయి.

ADVERTISEMENT

సాయికి జతగా సోనరిక నటిస్తున్న ఈ సినిమా ఆడియో సంక్రాంతి సందర్భంగా జనవరి 16వ తేదీన విడుదల కాబోతుండగా, సినిమా ఫిబ్రవరి 5న విడుదల కానుంది. ‘సుడిగాడు’ చిత్రం ద్వారా గ్రాండ్ సక్సెస్ అందుకున్న భీమనేని శ్రీనివాసరావు ఈ ‘అల్లుడు శీను’ను ఎంతవరకు గట్టెక్కిస్తాడో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories