ఇట్స్ యాక్సిడెంట్… ఫోరెన్సిక్ రిపోర్ట్ అవుట్..!

Sridevi Boney Kapoor Forensic Reportదుబాయ్‌ లో మృతి చెందిన హీరోయిన్ శ్రీదేవి భౌతిక కాయం ప్రస్తుతం అక్కడి అల్‌ ఖుసేనీ పోలీసు శవాగారంలోనే ఉన్న విషయం తెలిసిందే. కాగా, శ్రీదేవి ప్రమాదవశాత్తూ మృతి చెందారని యూఏఈ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన చేసింది. ఆమె ప్రమాదవశాత్తు బాత్ రూమ్‌లోని టబ్‌లో మునిగి చనిపోయినట్లు తమ వైద్యులు నిర్ధారించారని చెప్పారు.

ADVERTISEMENT

ఆ సమయంలో ఆమె మద్యం తీసుకుని వున్నారని, దాంతో పట్టు తప్పి నీళ్లలో పడిపోయారని ఫోరెన్సిక్‌ నివేదికలో పేర్కొన్నారు. ఆమె గుండె పోటుతో చనిపోయారని మొదట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఫోరెన్సిక్‌ నివేదికను శ్రీదేవి కుటుంబ సభ్యులకు భారత దౌత్య అధికారులు అందించారు.

ADVERTISEMENT
Latest Stories