షూటింగ్ కు ముందే ఫస్ట్ లుక్ రిలీజ్!

Srinivasa-Kalyanam---Nithiin,-Rashi-Khannaగత కొన్ని రోజులుగా మీడియా వర్గాలలో చర్చకు దారి తీసిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా మొదలయ్యింది. నితిన్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ తొలి రోజునే మోషన్ పిక్చర్ ను విడుదల చేసి వినూత్నమైన ప్రమోషన్ ను స్టార్ట్ చేసారు. ‘శతమానం భవతి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వేగేశ్న సతీష్ దర్శకుడిగా దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణం జరగబోతోంది.

నిజానికి ఈ సబ్జెక్ట్ ను తొలుత జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించారని, తారక్ కూడా కొన్ని మార్పులతో ఓకే చెప్పారన్న టాక్ రావడంతో ‘శ్రీనివాస కళ్యాణం’ టైటిల్ నెటిజన్లకు బాగా పరిచయం అయ్యింది. కానీ ఆ తర్వాత చేతులు మారుతూ చివరికి నితిన్ ఖాతాలో పడడం విశేషం. గతంలో ఇదే టైటిల్ తో వెంకటేష్ ఓ బంపర్ విక్టరీని అందుకున్న విషయం తెలిసిందే. ‘శతమానం భవతి’ మాదిరే ఈ ప్రాజెక్ట్ ను కూడా దిల్ రాజు చాలా వ్యక్తిగతంగా తీసుకున్నారని ట్రేడ్ వర్గాల టాక్.

ADVERTISEMENT

ఇక విడుదల చేసిన మోషన్ పిక్చర్ లో నితిన్, రాశి ఖన్నాల జోడి కన్నులవిందుగా ఉంది. మెలోడీ స్వరాలను అద్భుతంగా అందించే మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ అందిస్తుండగా, మరో హీరోయిన్ గా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేం నందిత శ్వేతా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక దిల్ రాజు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో ఉండే ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కూడా ఓ ప్రధాన భూమిక పోషిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories